బోలెడు కూరగాయలు మార్కెట్ నుండి తెలిస్తే అందులో కొన్ని మాత్రమే ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా బెండకాయ జిగురు అని, కాకరకాయ చేదు అని, బీట్రూట్ నచ్చదని ఇలా ఇంట్లో ముఖ్యంగా పిల్లలు చాలా మంది మొండి చేస్తారు. వీటిలో కూడా కాకరకాయ తినాలంటే 80% మంది పిల్లలు ముఖాన్ని అష్టవంకర్లు తిప్పుతూ ఆఖరికి ఏదో ఒక కారణం తో ఎగ్గొట్టి కాకరకాయ కంచం ముందు నుండి పారిపోతారు. కానీ ఒక్కసారి దీన్ని పిల్లతో చదివిస్తే వాళ్ళు తప్పకుండా కారకాయను ఇష్టంగా తింటారు మరి చదవండి.
◆కాకరకాయలో చిన్నవి, పెద్దవి కూడా దొరుకుతాయి. వీటిలో చిన్న కాకరకాయలు కంటే పెద్దవి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను మరియు చేదును కూడా కలిగి ఉంటాయి.
◆మన శరీరంలో ఆహారపదార్థాలు లేదా నీరు ఇతర పానీయాలు మొదలైన వాటి వల్ల శరీరంలోకి చేరిన విషపదార్థాలను కాకరకాయలోని చేదు విరిచేస్తుంది. చేదుగా ఉందనే కారణంతో దీన్ని దూరంగా ఉంచడం కంటే వండుకునే పద్ధతులు తెలుసుకుని విభిన్నంగా ప్రయత్నించి చూడటం ఉత్తమమని పెద్దల అభిప్రాయం.
◆కాకరకాయ రసంలో హైపోగ్లసమిస్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు హెచ్చుతగ్గులు లేకుండా చేయడంలో దోహాధం చేస్తుంది.
◆అలాగే రక్తంలో చెక్కర స్థాయిలు తగ్గించగలిగే చారన్ టిన్ అనే పదార్థం కూడా ఉంటుంది. అందుకే మధుమేహం ఉన్నవారికి కాకరకాయ అమృతతుల్యమైనదని చెబుతారు.
◆కాకరకాయ హైపర్ టెన్షన్ ను అదుపులో ఉంచడంలో దోహాధం చేస్తుంది. అలాగే చర్మ వ్యాధిగా పరిగణించబడే సొరియాసిస్ ను నివారిస్తుంది కూడా.
◆ఆకలిని పెంచి తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణమవడంలో దోహాధం చేస్తుంది. ఊపిరితిత్తులలో కఫము చేరి ఇబ్బంది పడుతున్నపుడు, నిమ్ము చేరినప్పుడు కాకరకాయను తీసుకోవడం వల్ల గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది.
◆కాకరకాయ రసాన్ని ఔషధంగా వాడుతుండటం కొన్ని చోట్ల గమనించవచ్చు, అయితే తాగడానికి మరీ సమస్య అనిపించేవాళ్ళు కూరల రూపంలో వండుకుని తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
◆శరీరాన్ని క్షోభకు గురిచేసే వాత వ్యాధులలో కాకరకాయ గొప్ప ఔషధంగా పని చేస్తుంది, ముఖ్యంగా వాత వ్యాధుల నుండి పక్షవాతం వరకు పథ్యపు భోజనంలో అందుబాటులో ఉంటుంది.
◆మలినమైన రక్తాన్ని శుద్ధి చేయడంలో సహకరిస్తుంది. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని స్థిరంగా ఉంచడంలో మరియు రక్తనాళాల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ ను నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
◆చాలామంది కాకరకాయ చేదును అధిగమించే ఉద్దేశంతో కారం ఉప్పు, పులుపు ను అధిక మోతాదులో వేసి వండటం వల్ల ఈ కూరలు పైత్యాన్ని తొందరగా దారి తీస్తాయి. అలాంటివాళ్ళు ఉప్పు, కారం పిలుపును అధికంగా వేగకుండా వండుకుని తింటే ఎలాంటి సమస్య లేకుండా గొప్ప ఆరోగ్యాన్ని మనకు చేకూర్చుతుంది.
చివరగా…..
కాకరకాయ ఎక్కడ కాసేది అయినా కాకరకాయనే అవుతుంది కానీ కీకరకాయ అవ్వదు అన్నట్టు దాన్ని ఉపయోగించుకునే విధం తోనే పలితాలు కూడా ఉత్తమంగా ఉంటాయని మర్చిపోకండి.