ప్రపంచవ్యాప్తంగా మనుషులను ఇబ్బందిపెడుతున్న వ్యాధి కాన్సర్. కాన్సర్ శరీరంలో ఏ భాగానికి అయినా వచ్చే అవకాశం ఉంది. ఆరంభంలో గుర్తిస్తే చికిత్స వలన మరణప్రమాదం తక్కువ ఉంటుంది. ముదిరితే ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తుంది. కాన్సర్ వచ్చిందని తెలిపేందుకు సూచనగా మన శరీరం కొన్ని లక్షణాలు చూపిస్తుంది. వాటిని గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం. నిత్యం పనులు చేస్తూ అలసిపోతుంటాం.ఆయా భాగాలలోనొప్పులు కూడా వస్తుంటాయి. కొంతసేపటికి అవి తగ్గిపోతాయి. కానీ కొన్ని రకాల నొప్పుల ు తగ్గకుండా వస్తూ ఉంటాయి. ఛాతిలో ఎప్పుడైనా నొప్పి అది గ్యాస్ లేదా గుండెనొప్పి కావొచ్చు. లేదా ఒక్కోసారి లంగ్ కాన్సర్ కూడా కావచ్చు. మరింత సమాచారం కోసం ఈ లింక్ చూడండి..
స్త్రీలకు కడుపునొప్పి తరచూ వస్తూ ఉండే అది అండాశయ లేదా గర్బాశయ కాన్సర్ కావచ్చు. ఇలాంటి నొప్పులను దీర్ఘకాలంగా వస్తూ ఉంటే డాక్టర్ను సంప్రదించి టెస్టు లు చేయించుకోవాలి. కాన్సర్ ఉందని తేలితే చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. క్రమంతప్పకుండా దగ్గు వస్తుంటే అది లంగ్, త్రోట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారు వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. మధుమేహం లేకున్నా కొంతమంది కి తరచూ మూత్రం వస్తూ ఉంటుంది. రోజులో ఎక్కువ సార్లు వెళ్తూఉంటారు. ఇలాంటి వారికి మూత్రాశయ కాన్సర్ వచ.చే అవకాశం ఉంది. వాళ్ళు ఆలస్యంచేయకుండా డాక్టర్ ను కలవడం మంచిది. కోలన్ కాన్సర్ ఉన్నవారికి విరోచనం కష్టంగా ఉంటుంది లేదా సమయం కాని సమయంలో వస్తూ ఉంటుంది. మలబద్దకం సమస్య లేకున్నా ఇలా జరుగుతుంటే మీరు డాక్టర్ ని సంప్రదించాలి .
బ్లడ్ కాన్సర్ ఉంటే తీవ్రంగా అలసట, నీరసం, ఆయాసం ఉండి ఏ పనీ చేయకపోయినా సరే తీవ్రమైన అలసటతో బాధపడుతుంటారు. ఇలా ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. నోరు, ముక్కు నుండి తరచుగా రక్తస్రావం జరుగుతుంటే దానిని కాన్సర్గా అనుమానించాలి. గర్బాశయ కాన్సర్ ఉన్న స్త్రీలలో యోనినుండి తరచుగా రక్తస్రావం జరుగుతుంది. కోలన్ లేదా రెక్టల్ కాన్సర్ ఉన్నవారిలో విరోచనం లో రక్తస్రావం ఉంటుంది. దగ్గుతో పాటు వచ్చే ఉమ్మిలో రక్తం ఉంటే దానినిలంగ్ కాన్సర్ గా భావించాలి. చాలామంది లో చర్మంకింద గడ్డలు ఏర్పడతాయి. వీటిని కొవ్వు గడ్డలు అని నిర్లక్ష్యం చేస్తారు. అవి కాన్సర్ గడ్డలు కూడా కావచ్చు.
అవి కొవ్వు గడ్డలా లేక కాన్సర్ గడ్డలా అనేది డాక్టర్ ను కలిసి పరీక్షల ద్వారా నిర్థారించుకోవడం మంచిది. చర్మ కాన్సర్ ఉన్నవారిలో చర్మంపై ఉండే మచ్చలు, పుట్టుమచ్చలు పెద్దగా మారడం, రంగుమారడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే అవి కాన్సర్ లక్షణాలు కావచ్చు. మధుమేహం లేకున్నా కొంతమంది లో గాయాలు త్వరగా మానవు. ఈ లక్షణం ఉన్నప్పుడు డాక్టర్ సలహాతో పరీక్షలు చేయించుకోవడం మంచిది. థైరాయిడ్, మధుమేహం ఉన్నవారు అనుకోకుండా బరువు తగ్గుతారు. అవిలేకున్నా సడెన్ గా బరువు తగ్గుతున్నారంటే అది కోలన్ కాన్సర్ కావచ్చు. అప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఘన లేదా ద్రవ పదార్థాలు మింగలేక పోతుంటారు.
థైరాయిడ్ లేకున్న పదార్థాలు మింగలేకపోతుంటే అది గొంతు కాన్సర్ అయ్యే అవకాశం ఉంది. మందులు వాడడం వలన ప్రాధమిక దశలో తగ్గిపోతాయి. రొమ్ముల్లో నొప్పిలేని గడ్డలు ఏర్పడటం, రొమ్ములు రెండు వేరువేరుసైజుల్లో ఉండడం, చనుమొనలు నుండి ద్రవాలు కారడం, చనుమొనలు రొమ్ముల్లో నొప్పి రావడం, చర్మం చిరాకు కలిగిస్తూ ఉంటే వెంటనే డాక్టర్ను కలవాలి. ఎవరిలోనైనా ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను కలవడం ద్వారా ప్రాణాపాయం కలగకుండా ఉండొచ్చు. అందుకే శరీరం అందించే సూచనలని అప్పుడప్పుడు గమనిస్తూ ఆరోగ్యం గా ఉందాం.