వయసు పెరిగేకొద్ది చర్మంపై ముడతలు ఏర్పడటం చాలా మామూలు విషయం. కానీ కొంతమందిలో చిన్న వయసులోనే ముడతలు ఏర్పడి అసలు వయసు కన్నా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు నీరు ఎక్కువగా తాగకపోవడం, పోషకాలతో నిండిన ఆహారం తీసుకోకపోవడం. ఇలా పోషకాలు లేని ఆహారం తినడం లేదా నీటిని తాగకపోవడం వలన శరీరం లోపల ఉండే రక్షణ కవచం దెబ్బతింటుంది. ఈ రక్షణ కవచం చర్మంలో సాగే గుణాన్ని, మరియు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీనివలన చర్మం ముడతలు పడి వృద్ధాప్యం వచ్చినట్టు అనిపిస్తుంది.
మన శరీరంలో చర్మం తాగే కణజాలాన్ని కలిగి ఉండడానికి కొలాజిన్ కారణమవుతుంది. కొలాజిన్ కాపాడుకోవడానికి విటమిన్ సి చాలా అవసరం. దీని వలన ఆహారం ద్వారా తీసుకున్నప్పుడు కూరగాయలు వండినప్పుడు విటమిన్-సి ని కోల్పోతుంది. అందుకే విటమిన్ సి ని పొందాలంటే వండకుండా సహజ పదార్థాల ద్వారా తీసుకోవాలి. విటమిన్ సి చాలా ఆహారపదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఉసిరి విటమిన్ సి కి మంచి మూలం. ఉసిరిలో అన్నింటి కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది.
అందుకే ఉసిరిని అందుబాటులో ఉన్నప్పుడు ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు ముక్కలు తినడం వలన విటమిన్ సి లభిస్తుంది. అలాగే ఉసిరిని దంచి రసం తీసి తేనెతో కూడా కలిపి తీసుకోవచ్చు. కొంతమంది నిల్వ చేసుకోవడానికి తేనెలో ఊరబెట్టిన తింటారు. స్వచ్ఛమైన తేనెను తీసుకొని కొంచెం తేమ తగ్గిన ఉసిరి ముక్కలను ఇందులో వేసి పెట్టొచ్చు. ఇవి వాడడం వలన విటమిన్ సి ని పొందవచ్చు.
రోటిలో ఉసిరి పచ్చడి తయారు చేసుకొని తినడం వలన కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతేకానీ ఉసిరితో ఆవకాయ పచ్చడి పెట్టడం వలన దానిలో ఉండే విటమిన్ సి పూర్తిగా నశిస్తుంది. ఇలా నేరుగా తీసుకోలేని వారు ఉసిరి ముక్కలు పండ్ల ముక్కలతో కలిపి జ్యూస్ చేసి తాగవచ్చు. ఇలా ఏదో విధంగా విటమిన్ సి పుష్కలంగా తీసుకోవడం వలన శరీరంపై ముడతలు ఏర్పడడం తగ్గించుకోవచ్చు. చర్మం ఆరోగ్యంగా కాంతులీనుతూ ఉండేలా చేసుకోవచ్చు.