అల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే దీన్ని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అల్లం లో దాగిఉన్న ఆరోగ్యప్రయోజనాలు గురించి తెలిస్తే తప్పకుండా రోజువారి ఆహారంలో అల్లాన్ని చేర్చుకుంటారు ఎందుకంటే అల్లం వలన మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్నే టీలో అల్లం కలుపుకొని తాగడం వల్ల అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా లేదా తేనెతో కలిపి తిన్న టీ చేసుకొని తాగినా మంచిదే. అల్లం వలన కలిగే ఆరు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం
- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:- కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లో ప్రతి ఒక్కరూ తమ రోగనిరోధకశక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో లో రోజూ అల్లాన్ని తీసుకోండి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి
- బరువును తగ్గిస్తుంది:- లాక్ డౌన్ వల్ల చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కేసులు చూస్తుంటే మున్ముందు కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున బరువు తగ్గడంలో దృష్టి పెట్టండి. అల్లం మీ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమయంలో మీ క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావడానికి ఈ అల్లం తోడ్పడుతుంది
- బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది:- మధుమేహం ఉన్న వాళ్ళు తప్పకుండా అల్లం తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది అని ఇటీవల జరిగిన ఓ సర్వేలో తేలింది. అలాగే మధుమేహం రోగుల ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు అల్లం ఉపయోగపడుతుంది. అయితే దీనిని మీరు డైట్ లో తీసుకోవాలనుకుంటే వైద్యుల సూచనలను తీసుకోండి.
- కండరాల నొప్పులకు మందు:- వ్యాయాయం వల్ల కలిగే కండరాల నొప్పులను అల్లం ప్రభావవంతంగా తగ్గిస్తుంది. అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు. నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు అల్లం కీళ్ళ నొప్పులను ఆర్థరైటిస్ నొప్పులను కూడా తగ్గిస్తుంది
- జలుబు దగ్గు కు ఉపశమనం:- అల్లం జింజర్ రోల్ ను కలిగి ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఒక అల్లం టీ తాగితే చాలు అన్ని క్షణాల్లో మాయం అయ్యి మంచి ఉపశమనం పొందుతారు.
- అజీర్ణ సమస్యలు:- కడుపు ఖాళీ అవ్వడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అల్లంచాలా మంచిది. కడుపులో ఏర్పడే నొప్పులను కూడా తగ్గిస్తుంది. వికారంతో బాధ పడుతున్న వారికి ఒక మంచి మందు కూడా. ఈ అల్లాన్ని డైట్ లో చేర్చుకొనే ముందు తప్పకుండా ఆహార నిపుణులు లేదా వైద్యుల సూచనలు పాటించండి.