స్ప్రింగ్ ఆనియన్స్ అనగానే అందరికి గుర్తొచ్చేది.. చైనీస్ ఫ్రైడ్ రైస్ !! అంతే కదండి? మన భారతీయులు అందరు.. ఎక్కువగా చైనీస్ ఫ్రైడ్ రైస్ లో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ని వాడుతుంటారు, హోటల్స్ లో కూడా మనం తింటూనే వుంటాము. గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ లేదా స్ప్రింగ్ ఆనియన్స్ గా పేరుగాంచిన ఈ కూరని తెలుగులో ఉల్లికాడలని పిలుస్తారు. చైనీస్ వారు మాత్రం, కేవలం రుచి పరంగానే కాకుండా..రెగ్యులర్ వంటల్లో ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. మరి తెలుసుకుందామ? వీటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో?
స్ప్రింగ్ ఆనియన్స్ లో ఉండే రుచి.. మన వైట్ ఆనియన్స్ లో కూడా ఉండదు. పోషకాలతో నిండి ఉండే ఈ ఉల్లికాడాలని చైనీస్ వారు ఔషదాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. విటమిన్ కె, సి, బి 2,, కాపర్, పొటాషియం, ఫ్లెవనాయిడ్స్ ఇందులో అధికంగా ఉంటాయి. అతి తక్కువ క్యాలరీలు ఉండే ఉల్లికడాలని రోజు వంటల్లో వాడితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకుంటారు.
వెజిటెబుల్ సూప్స్ లో దీన్ని వాడుకోవచ్చు.. లేదా సలాడ్స్ లో గార్నిష్ లా వాడుకోవచ్చు.
- దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు
- రాత్రి పూట ఇలా చేస్తే వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది

వీటి ఆరోగ్య ప్రయోజనాలు మరి కొన్ని తెలుసుకుందాం…
- పీచు పదార్ధం అధికంగా ఉండే ఈ ఉల్లికాడలు జీర్ణ శక్తిని పెంచుతాయి. వారానికి రెండు మూడు సార్లు తింటే ఎంతో మేలు జరుగుతుంది.
- శరీరంలో మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్ కంటెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో తోడ్పడుతుంది.
- ఉల్లికాడల్లో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి… వీటిలో అల్లి సల్ఫైడ్స్ ప్రీరాడికల్స్ తో పోరాడుతుంది. క్యాన్సర్ సెల్ల్స్ అభివృద్ధిని నిరోధిస్తుంది. ఒకవిధంగా కాన్సర్ తో పోరాడుతుంది.
- స్ప్రింగ్ ఆనియన్స్ లో విటమిన్ కె, సి, ఇతర పోషకాలు అధికంగా ఉన్నందున, ఎముకలు ఎంతో భలంగా ఉంటాయి. అందుకే వీటిని రోజు మీ డైట్ లో వాడటం చాల అవసరం.
- ఉల్లికాడల్లో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి లు… శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. గుండె సమస్యలను కూడా దూరం పెడతాయి.
- కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ ను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కలిగి ఉంటాయి.
ఇన్ని పోషక విలువలున్న ఉల్లకాడల గురించి చదవడమే కాదు… వాటిని మీ రోజువారి వంటలో భాగం చేయండి, మరింత ఆరోగ్యనాన్ని మీ సొంతం చేసుకోండి.