పొడవైన జుట్టు చాలా మంది కల. అయితే మొదట జుట్టు పెరగడం ఏమో కాని జుట్టు రాలిపోవడాన్ని చూసి భరించలేరు. జుట్టు రాలిపోవడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. చాలా మంది జుట్టు రాలిపోతుంటే జుట్టు పెరగడం కోసం బోలెడు ప్రయోగాలు చేస్తుంటారు. అందుకే ముందుగా జుట్టు రాలడాన్ని అరికడితే తరువాత జుట్టు పెరగడం అనే ప్రక్రియ మొదలు పెట్టవచ్చు. అయితే జుట్టురాలడాన్ని అడ్డుకోవడానికి కూడా షాంపూ లు, నూనెలు వాడేస్తుంటారు. అది చాలా తప్పు జుట్టు పెరగడం కానీ రాలడం కానీ పైన నుండి జరిగే నష్టం కొద్దిగానే. మన శరీరంలోపల జరిగే పరిణామాలు ఎక్కువగా జుట్టు రాలడం కు కారణం అవుతుంటాయి. అలాగే జుట్టు పెరగాలన్నా మన శరీరంలో పోషకాల లోపాలను భర్తీ చేసుకోవాలి.
ఇపుడు జుట్టు రాలిపోవడం అనే సమస్యను అరికట్టడానికి మీకోసం ఆరు చిట్కాలు ఇస్తున్నాం ఒకసారి వాటిని పాటించి ఫలితాన్ని చూడనంది మీరే నమ్మలేరు.
గ్రీన్ టీ
గ్రీన్ టీ బరువు తగ్గడానికి అని చాలా మంది అనుకుంటారు కానీ జుట్టు రాలడమనే సమస్యకు కూడా కట్టడి చేస్తుంది. గ్రీన్ టీ ని రోజు తీసుకోవడమే కాకుండా కొద్దీ కొద్దిగా జుట్టు కుదుళ్లకు పట్టేలా మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. దానివల్ల కుదుళ్లలో రక్తప్రసరణ జరిగి ఇందులో అధికామోతాదులో ఉన్న EGCG గుణాలు జుట్టు రాలడమనే సమస్యను అరికడతాయి.
కొబ్బరి నూనె
ఇది అందరికీ తెలిసినదే. 90% మంది జుట్టుకు వాడేది కొబ్బరి నూనెనే. నిజానికి మనిషి ఆరోగ్యంగా ఉన్నపుడు జుట్టు పెరగడానికి జుట్టు సంరక్షణలో కేవలం కొబ్బరి నూనె సరిపోతుంది. ఏవేవో చేసి పెంచాల్సిన అవసరం లేదు. అయితే కాలం తో వస్తున్న మార్పుల వల్ల జుట్టు డామేజ్ అవుతూ ఉంటుంది. కొబ్బరి నూనెలో లూరిక్ ఆసిడ్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. రాత్రి పడుకునే ముందు జుట్టుకు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దనా చేసుకుని తరువాత ఉదయాన్నే తలంటు పోసుకోవాలి. ఇలా వారంలో రెండు నుండి మూడు సార్లు చేస్తుంటే సమస్య పరిష్కారం అవుతుంది.
ఉల్లిపాయ
చాలా శక్తి వంతంగా జుట్టు రాలడమనే సమస్యను ఉల్లిపాయ ఎదుర్కొంటుంది. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లకు పట్టేలా మసాజ్ చేసుకుని గంట తరువాత తలంటు పోసుకోవాలి. కుదిరితే వారంలో రెండు సార్లు కూడా వాడచ్చు. కేవలం రెండు సార్లు వాడగానే ఫలితం కనబడుతుంది.
పసుపు
పసుపు గొప్ప యాంటి బాక్టీరియల్ లక్షణాలు కలిగినదని అందరికి తెలిసినదే. మనం రోజువారీ ఆహారంలో పసుపును వాడుతూ రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు లేదా, పసుపు టీ ని తీసుకోవడం వల్ల పసుపుతో ఉన్న కుర్కుమిన్ అనే రసాయనం జుట్టు రాలడాన్ని ఆవుతుంది. ఇది ఆరోగ్యానికి గొప్ప సంరక్షణ కూడా.
గుమ్మడి విత్తనాలు
గొప్ప ఎంజైమ్ లతో కూడిన గుమ్మడి విత్తనాలు జుట్టు రాలే సమస్యను ఎదుర్కోవడంలో బాగా పని చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ కోవకు చెందిన వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఫలితం బాగుంటుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది.
సొయా చిక్కుళ్ళు
చాలా మంది సోయాను ఎక్కువగా ఇష్టపడరు. కారణం ఇవి వగరుగా రుచిని కలిగి ఉండవని. అయితే తాజా సోయా చిక్కుళ్లను కూరగా వండుకుని తినడం వల్ల కేవలం జుట్టు రాలడమనే సమస్యకు చెక్ పెట్టడమే కాదు గొప్ప ఆరోగ్యాన్ని పొందవచ్చు. డయాబెటిస్ రోగులకు చాలా అమృత సమానమైన సోయా తప్పకుండా తీసుకోవాలి.
చివరగా…..
జుట్టు రాలడం అనే విషయం పట్ల ఆందోళనను ఆపి పైన చెప్పుకున్న చిట్కాలను పాటిస్తే సమస్య తొందరగా పరిష్కారమవుతుంది. మరి పాటించండి