6 mistakes will do while drinking water

నీటిని తాగడంలో 90% మంది చేసే ఆరు పొరపాట్లు ఇవే

మన శరీరానికి గొప్ప ఇంధనం నీరు. నీరు తగినంత లేకపోతే మన శరీరం  డీహైడ్రేట్ కు గురవుతుంది. తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా, మన శరీరంలో అవయవాలు ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉండాలన్నా, మన శరీరంలో  మలినాలు బయటకు వెళ్లాలన్నా నీరు ఒక ముఖ్య వనరు. అందుకే రోజుకు కొలతలు పెట్టుకుని మరీ నీటిని తాగుతుంటారు అందరూ.

అసలు  నీటిని తాగడం ఎలా?? 

ఆ ఏముంది బాటల్ లోనో, గ్లాసులోనో నింపుకుని గుటగుట ఎత్తేయడమే అనుకోవచ్చు. సాధారణంగా మన రోజువారీ పనుల్లో మనం మంచినీటిని తాగుకుంటాం. అలా తాగుతున్నపుడు చాలా మనది పొరపాట్లు చేస్తున్నారని తెల్సింది. అసలింతకు ఆ పొరపాట్లు ఏమిటి?? వాటి వల్ల నష్టాలు ఏమిటి?? చదవండి మరి.

◆ చాలా మంది బయటకు వెళ్ళినపుడు, ఉదయం రన్నింగ్, జాగింగ్,వాకింగ్ ఇలా వెళ్ళినపుడు మధ్యలో  సిప్పర్ తో లేక బాటల్ లో తెచ్చుకున్న నీళ్లు నిలబడుకునే తాగేస్తుంటారు. ఇది చాలా పొరపాటని చెబుతున్నారు నిపుణులు.  నిలబడుకుని నీళ్లు తాగడం వల్ల శరీరంలో జాయింట్స్ మీద చాలా ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం కిడ్నీల మీద ఎక్కువగా దుష్ప్రభావం చూపిస్తాయి. తాగిన నీటిని వడపోత చేయడంలో కిడ్నీలు కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఎపుడైనా ఎక్కడైనా నీటిని కూర్చుని తాగాలి.

◆అందరూ చేసే మరొక పెద్ద పొరపాటు. రోజుకు ఇన్ని లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలని అనుకుని దాహం వేసినా వేయకున్నా తాగేయడం. మన శరీరంలో నీటి అవసరం ఏర్పడినప్పుడు మన మెదడు, శరీరం నీటిని తాగమని మనకు సూచనలు ఇస్తుంది, అపుడే మనకు దాహమేస్తుంది, మనం నీళ్లు తాగుతాం. ఈ ప్రక్రియను బట్టే మనం నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని కొలత ప్రకారం కాదు.

◆ఎండకు తిరిగి అలసిపోయినపుడు కావచ్చు బాగా దాహమేసినపుడు కావచ్చు, కొంచం పని ఎక్కువ చేసినపుడు కావచ్చు చాలా మంది ఒకసారి పైకెత్తారంటే బాటల్ కానీ, నీళ్ల చెంబు కానీ దించకుండా తాగేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. నీటిని ఒకేసారి ఎక్కువ మోతాదులో తాగకూడదు. దీనివల్ల గుండె పట్టేసే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అంతేకాదు జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. గ్యాస్ట్రిక్ట్ సమస్యకు దారితీస్తుంది.

◆  అలసిన శరీరం చెమటలు కక్కుతుంటే చాలామంది చేసే పని ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసి చల్లటి నీళ్లు తాగడం. దీనివల్ల రిలాక్స్ అవుతాం అనుకుంటారు కానీ అది పొరపాటు. అతి చల్లని నీళ్లు జీవక్రియను దెబ్బతీస్తాయి. అతి చల్లగా ఉన్న నీళ్లు జీర్ణం కావడానికి దాదాపు భోజనం ఎంత సమయం తీసుకుంటుందో అంత సమయం పడుతుంది. ముఖ్యంగా కంటెం ద్వారా కూల్ చేసిన నీళ్లు డీహైడ్రేట్  కు దారి తీస్తాయి.  అందుకే గది ఉష్ణోగ్రత, లేదా సహజంగా చల్లబడిన కుండలో నీళ్లు తాగడం ఉత్తమం.

◆ ఉదయాన్నే బెడ్ కాఫీ లు ఫాషన్ అయిపోయాయి. గుక్కెడు కాఫీ తాగేది తరువాత బాటల్ నీళ్లు ఎత్తేసి తాగడం కొందరు చేసే తప్పు. కాఫీ టీ సమయాల్లో నీటిని తాగకూడదు. పరగడుపున నీరు తాగే అలవాటు ఉన్నోళ్లు కాఫీ టీ లకు ఆ సమయం లో దూరం ఉండాలి.

◆ చాలా మంది డైటింగ్ చేసేవారు భోజనానికి ముందు ఎక్కువ నీళ్లు తాగేస్తారు. దానివల్ల ఆహారం తక్కువ తీసుకువచ్చే ఆలోచన వాళ్లకు ఉంటుంది. ఇది చాలా తప్పు నీటిని ఎప్పుడూ భోజనం చేయడానికి అరగంట ముందు అలాగే ఆరంగా తరువాత మాత్రమే తాగాలి. భోజనం సమయం లో కొద్దిగా అంటే ఒక గ్లాసు వరకు పరిమితిగా తాగచ్చు.

చివరగా…….

పైన చెప్పుకున్నట్టు నీటిని తీసుకోవడంలో ఆరు పొరపాట్లను సరిచేసుకున్నాకా మీ జీవన శైలిలో వచ్చిన మార్పులు మీరే గమనించండి. మీకే తెలుస్తుంది మరి తేడా.

Leave a Comment

error: Content is protected !!