శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటూ, నల్లని జుట్టు, అందమైన చర్మం అన్నీ ఒకే ఒక్క అలవాటుతో ఆరోగ్యం గా మారిపోవాలంటే మనకు అందుబాటులో ఉన్న పదార్థం ఈ అద్భుతాలను చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వీటిపై అవగాహన ఉన్నా కూడా మనం నిత్యం ఉపయోగించడంలో అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఆ అద్బుతమైన పదార్థం ఉసిరికాయ. ఉసిరికాయలో ఉండే విటమిన్ పి శరీరాన్ని ఆరోగ్యంగా చేయడంలోనూ, రోగాలను దూరంగా పెట్టడంలోనూ, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడానికి, చర్మానికి మెరుపునిచ్చి, మచ్చలు లేకుండా చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది.
అయితే దీనిని ఉపయోగించడంలోనే అసలైన టెక్నిక్ ఉంటుంది. ఉసిరికాయలు దొరికినప్పుడు ఎక్కువగా తినాలి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉసిరి ఆవకాయ. కానీ ఉసిరి ఆవకాయ తినడం వలన శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభించవు. నిల్వ పచ్చడి వలన లాభాల కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఉసిరిని ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం దగ్గర పడుతుంటే ఉసిరికాయ ఎక్కువగా లభిస్తాయి. వీటిని తెచ్చుకొని శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడిచి, తరువాత శుభ్రంగా తురుముకోవాలి.
ఇలా తురుముకున్న ఉసిరిని ఒక గ్లాసులోకి తీసుకొని అది మునిగేంత వరకు ఒక గ్లాసు నీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు నల్ల ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత వడకట్టు సహాయంతో దీనిని వడకట్టుకోవాలి. ఇప్పుడు వడకట్టగా మిగిలిన నీటిని రోజు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆమ్లాలో వైద్యం మరియు ఔషధ గుణాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్, విటమిన్ బి, ప్రోటీన్ మరియు ఫైబర్ ఉన్నాయి. ఇక జుట్టు నల్లగా చేసుకోవడానికి ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
వీటిని ఒక గ్లాస్ జార్లో వేసుకొని కొబ్బరి నూనె లేదా మీరు ఉపయోగించే ఏదైనా నూనెను వేసుకోవచ్చు. తరువాత ఒక ఐదు రోజుల పాటు నూనెను ఎండలో ఉంచి తరువాత తలకు ఉపయోగించడం వలన జుట్టు రాలడం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం సమస్య, చుండ్రు వంటివి తగ్గుముఖం పడతాయి. ఇది తలలో పేరుకొన్న చుండ్రును శుభ్రం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. దీనివలన తలలో పుండ్లు దురద వంటి సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు చిట్కాలు పాటించడం వలన ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది.