బాదం గురించి అందరూ వినే ఉంటారుగా.
బాదం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.
ధర కొంచెం ఎక్కువైనా బాదంలో ఉన్న అన్ని ప్రయోజనాలు మరే ఇతర డ్రై ఫ్రూట్స్ లోను లేవనే చెప్పవచ్చు. బాదం అటు సౌందర్య సాధనంగానూ,
మరోవైపు తినుబండారం గాను, ఆయిల్ గాను, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.
బాదంలో కాల్షియం , మెగ్నీషియం, పొటాషియం పాస్పరస్ ప్రోటీన్స్ మొదలైన ఖనిజాలు కలవు. ఇవి మానవ శరీరానికి ఎంతో ఉపయోగకరమైనవి.
ఇక మానవుల ఆరోగ్యానికి గొప్ప వరమనే చెప్పుకోవచ్చు. బాదంను సరైన రీతిలో ప్రతి రోజు ఉపయోగిస్తే ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే. ఇది ఎన్నో విధమైన ఆరోగ్య సమస్యలకు ఖచ్చితమైన ఔషధంగా పనిచేస్తుంది.
ఉదయాన్నే బాదం తింటున్నారా..
◆కరోనా అందరిలోనూ ఇంకా భయాన్ని కలుగజేస్తూనే ఉందన్న విషయం మనకు తెలిసిందే. చాలామంది రోగనిరోధకశక్తి లేక తొందరగా అలసిపోయి ఇంకా నీరసంగా మారిపోతారు. బాదం ఇలా నీరంగా ఉండేవారికి మేలు చేకూరుస్తుంది.
◆బాదం పప్పు తినడం వల్ల రోగనిరోధక శక్తికి కారణమయ్యే తెల్లరక్తకణాల సంఖ్య పెరిగి ఎలాంటి జబ్బులకు లోను కాకుండా కాపాడుతుంది. బాదం తింటే విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కొవ్వును నియంత్రిస్తుంది. బాదంలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి.
◆తరచుగా బాదం తింటూ ఉంటే మలవిసర్జ సరిగా జరగక మాలబద్దకంతో ఇబ్బంది పడేవారు ఆ సమస్యనుండి సులువుగా బయటపడతారు.
◆బాదం తింటే మీకు కావాల్సినంత పొటాషియం లభిస్తుంది. ఇందులో సోడియం చాలా తక్కువ ఉంటుంది అందుకే బీపీ సమస్య ఉన్నవారు వీటిని తీసుకుంటూ ఉంటే మంచిది. రక్తప్రసరణ సరిగా జరిగి గుండె సంబంధిత జబ్బులకు సగం పరిష్కారం దొరికినట్టే.
◆ఉదయాన్నే బాదం తింటే శరీరానికి కావలసిన ఇనుము లభిస్తుంది. బాదం తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉండే చెడు కొవ్వులు సులువుగా తగ్గుముఖం పడతాయి. వీటిని తరచుగా తినేవారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ అని నిరూపితమైంది కూడా.
◆ రోజూ బాదం తినలేకపోయినా కనీసం వారానికి నాలుగైదు రోజులు బాదం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెదడు కూడా చాలా ఉత్తేజంగా ఉంటుంది. అలాగే చాలా రకాల క్యాన్సర్లు అరికట్టవచ్చు. బాదం ఆయిల్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెదడును చల్లబరచి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
◆బాదం పప్పులు తీసుకుని ముందుగా నానబెట్టి ఫేస్ట్ చేసి మొహానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మృదువైన పాలుకారే చర్మం సొంతం అవుతుంది. ఇలా వారానికి ఒకటి రెండుసార్లు చేస్తూ ఉంటే వేరే ఏ సౌందర్య ఉత్పత్తులు వాడాల్సిన అవసరం ఉండదు
చివరగా…..
బాదం తో ఎన్నో ప్రయోజనాలు, చెప్పేకొద్ది ఊరుతూనే ఉంటాయి. అందుకే బాదం ను కొద్దిగా వెల ఎక్కువైనా ఆరోగ్యం కోసం కాసిన్ని తెచ్చేసుకుని కంటైనర్ లో దాచేసుకోండి.