పురుషులకు కూడా సౌందర్య రక్షణ అనేది చాలా అవసరం. బయట తిరిగి మగవారిలో ఎండ, దుమ్ము, ధూళి చర్మాన్ని చాలా పాడుచేస్తూ ఉంటాయి. అయితే వారి చర్మం స్త్రీల చర్మానికి భిన్నంగా ఉంటుంది. కొంచెం రఫ్గా ఉండే పురుషులు చర్మ రక్షణ చర్యలు చాలా అవసరం. దానికోసం ముందుగా చర్మతత్వాన్ని తెలుసుకోవాలి.
చర్మం నార్మల్గా ఉండి ఎటువంటి చర్మ సమస్యలు లేకుండా నార్మల్ స్థాయిలో ఆయిల్స్ విడుదలయ్యే ఈ చర్మాన్ని నార్మల్ స్కిన్ అంటారు.
కొందరి చర్మం ఎన్ని రకాల మాయిశ్చరైజర్లు రాసినా కొంతసేపటికే పొడిబారి ఎక్కువ వయసున్న వారిలా కనిపిస్తారు. ఇటువంటి వారు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడాల్సి ఉంటుంది. వీరి కోసం ప్రత్యేక ఫేస్వాష్లు కూడా అందుబాటులో ఉంటాయి.
తర్వాత ఎక్కువగా నూనెలు విడుదలయ్యే చర్మాన్ని ఆయిల్ స్కిన్ అంటారు. ఎన్నిసార్లు ముఖాన్ని శుభ్రంగా కడిగిన కొంతసేపటికి నూనె విడుదలవుతుంది. ఇటువంటి చర్మానికి వితౌట్ ఆయిల్ ఉండే మాయిశ్చరైజర్లు, ఫేస్ వాష్ లు వాడాల్సి ఉంటుంది.
కాంబినేషన్ స్కిన్ ఈ చర్మం ఉన్నవారికి ముక్కు, నుదురు, గడ్డం కింద ఆయిల్ విడుదలవుతూ మిగతా చర్మం పొడిగా ఉంటుంది. ఈ చర్మతత్వం కలవారు కాంబినేషన్ స్కిన్ ప్రత్యేకంగా తయారుచేసిన ప్రొడక్ట్స్ మాత్రమే వాడవలసి ఉంటుంది.
సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి అంత త్వరగా ఏ ప్రోడక్ట్ పడవు. ఏదిబడితే అది ఉపయోగించకూడదు. త్వరగా దురదలు, ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాచ్ టెస్ట్ చేయకుండా ఎటువంటి పదార్థాలు ఉపయోగించకూడదు. వీరికి ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఉంటాయి. అవి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
ఇక అందమైన స్కిన్ కోసం ఆరోగ్య చిట్కాలు:
1.ఎండలో తిరిగేవారు వీలైనంత ఎండకు దూరంగా ఉండాలి. తప్పని పరిస్థితుల్లో సన్ స్క్రీన్ లోషన్ 30 ప్లస్ పిఎఫ్ ఉన్నది ఉపయోగించాలి.
2.సబ్బుకు బదులు ఫేస్ వాష్ ను ఉపయోగించడం వలన ముఖ చర్మాన్ని కాపాడుకోవచ్చు. మన చర్మ తత్వాన్ని బట్టి ఫేస్ వాష్ ఉపయోగించాలి.
3. వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ ఉపయోగించండి. ఇంట్లోనే తయారు చేసుకునే అనేక ఫేస్ ప్యాక్లు యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి. వాటిని చూసి ప్రయత్నించండి.
4. షేవింగ్ చేయడం వలన చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. కానీ షేవింగ్ క్రీమ్ వలన మొఖం పొడిబారే అవకాశం ఉంది. అందుకే ఒక మంచి బ్రాండ్ షేవింగ్ క్రీములు ఉపయోగించండి.
5. రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగండి.
6. ఫేస్ క్రీమ్ రాసేటప్పుడు రెండు నిమిషాలు మసాజ్ చేయండి.
7. జంక్ ఫుడ్ బదులు పండ్లు ఎక్కువగా తింటూ ఉండండి.
8.నానబెట్టిన బాదం ఉదయాన్నే తీసుకోండి.
9. రోజూ కొంత సమయం వ్యాయామం చేయండి.
10. ఎటువంటి హానికరమైన వైటెనింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించకండి. అవి ప్రమాదకరం తప్ప చర్మం తెల్లగా అవ్వడానికి ఉపయోగపడవు.