వేగవంతమైన జీవితంలో అందరికి అన్ని తొందరే. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు. అన్ని ఉరుకుల పరుగుల జీవితాలు. ఈ బిజీ జీవితంలో కొందరు తినడం కూడా వదిలేసి మరీ పనుల్లో పడిపోతుంటారు. అయితే ఆహారం లేకుండా కొన్ని పనులు అసలు చేయకూడదు అనే విషయం చాలా మందికి తెలియదు. ఒకప్పుడు పెద్దలు చెప్పినా పెడచెవిన పెట్టేవారు. కానీ ఇపుడు వాటిని డాక్టర్లు, నిపుణులు చెబుతుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోడానికి సన్నద్ధం అవుతున్నారు.
ఏది ఏమైనా ఖాళీ కడుపుతో మీరు ఎప్పుడూ చేయకూడని కొన్ని పనులు ఇక్కడ ఉన్నాయి, అవి రోజు మొత్తంలో అసౌకర్యాన్ని మరియు దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. అవేంటో చూద్దాం మరి
కాఫీ లేదా టీ తాగడం
మనలో చాలా మంది పెద్దలకు, రోజు ముఖం కడగగానే కాఫీ తాగడం అలవాటు. ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల కడుపులోని ఆమ్ల స్థాయి పెరుగుతుంది. అంతే కాదు వాంతులు లేదా మలబద్ధకం సమస్యలకు ఇది కారణం అవుతుంది. జీర్ణాశయ పనితీరును మందగించేలా చేస్తుంది. కాబట్టి పరగడుపున కాఫీ టీ లు తీసుకోవడం మంచిది కాదు.
వ్యాయామం
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ బరువు తగ్గరు. వాస్తవానికి భారీ వ్యాయామాలు చేసేటప్పుడు ఖాళీ కడుపుతో పనిచేసేటప్పుడు కండర ద్రవ్యరాశిని కోల్పోతారు.
శరీరాలకు సరైన కొవ్వు మరియు ప్రోటీన్‌తో సరైన పోషకాహారం అవసరం, కాబట్టి తినకుండా వ్యాయామం చేసే ప్రయత్నం మానుకుంటే శారీరక దృఢత్వానికి సంబందించిన సమస్యల నుండి తప్పించుకున్నట్టే.
ఆమ్లత్వం కలిగిన పళ్ళు, ఆహారం
కొన్ని ఆహార పదార్థాలు లేదా పండ్లలో రసాయన లక్షణాలు ఉన్నాయి, అవి మీ కడుపులోని ఆమ్ల రసాలతో చెడుగా స్పందిస్తాయి. ఖాళీ కడుపుతో టమోటాలు, సిట్రస్ ఉన్న పళ్ళు తినడం వల్ల కరగని జెల్లను సృష్టిస్తుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లు రావడానికి కారణం అవుతుంది. .
అరటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఆకలితో ఉన్నప్పుడు అరటి పండు తీసుకోవడం వల్ల శరీరంలో మెగ్నీషియం మరియు కాల్షియం స్థాయిల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఇవి మాత్రమే కాదు నారింజ, పాలు మరియు పెరుగు కూడా కాళీ కడుపుతో తినకూడదు.
మద్యపానం
ఖాళీ కడుపుతో మద్యం తీసుకున్న వారికి అది చాలా వేగంగా మత్తులోకి తీసుకెళ్తుంది. ఆల్కహాల్ వేగంగా రక్తప్రవాహంలోకి వెళ్లి శరీరమంతా త్వరగా వ్యాపిస్తుంది.
చాలా భయంకరమైన తలనొప్పి వంటి సమస్యలు దీనివల్లనే వస్తాయి.
అధిక తీపిని తినడం
ఖాళీ కడుపుతో శరీరం చక్కెరను త్వరగా గ్రహిస్తుంది, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అధిక రక్తంలో చక్కెర మీ రక్త నాళాలలో దెబ్బతిన్న కణాల ప్రమాదాన్ని పెంచుతుంది.
ప్రయాణం చేయడం
ఖాళీ కడుపుతో ప్రయాణించేటప్పుడు మీకు ఇబ్బంది కలగడంలో ముఖ్యమైనది వికారం. లాంగ్ డ్రైవ్ పేరుతో ఎక్కువ దూరం ప్రయాణించేవారు కాళీ కడుపుతో వెళ్లడం ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావితం చూపిస్తుంది. ప్రయాణ బడలిక తరువాత నీరసం, అలసట లో ఆహారాన్ని తీసుకోవడానికి శరీరం సన్నద్ధంగా ఉండదు కాబట్టి వీలైనంత వరకు అల్పాహారమైనా తిన్న తరువాతనే సన్నద్ధమవ్వండి.
చివరగా…..
ఏదైనా పని చేయాలంటే శక్తి కావాలి. అలా కావాలంటే కనీసం అల్పాహారం అయినా తీసుకోవాలి కాబట్టి కాళీ కడుపుతో పనుల్లోకి దిగకండి. అదే ఆరోగ్యాన్ని కాపాడే మొదటి సూత్రం.