7 Bad Food Combinations That You Should Avoid Eating

పొరపాటున కూడా వీటిని కలిపి తినకండి

మనం తినే ఆహారంలో కొన్ని పదార్థాలు కలిపి తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మనం కేవలం నాలుక కు నచ్చిందా లేదా అనేది చూస్తాం. కానీ అది శరీరానికి ఆరోగ్యమైనదా కదా అని ఆలోచించము. అలా మనం ఆలోచన లేకుండా కలిపి తినేస్తున్న కొన్ని పదార్థాలు మనకు మరణాన్ని చాలా తొందరగా తీసుకొస్తాయని ఇప్పటిదాకా తెలియదు. అయితే ఇపుడు తెలుసుకోండి.

చపాతీలు, పూరీలు

గోధుమ పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దానితో రోటీలు చేసుకుని తినడవం వల్ల గొప్ప ఆరోగ్యం మన సొంతం అయితే గోధుమ పిండితో చపాతీలు, పూరీలు చేసుకుని తినడం వల్ల గోధుమ పిండిలో ఫైబర్ నూనె తో కలిసి మనకు ఫైబర్ ను అందకుండా తొందరగా కరిగి గ్లూకోజ్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా షుగర్ అనే భయం తో అన్నం మానేసి చపాతీలు తింటున్న వారికి  అన్నంలో కంటే ఎక్కువ గ్లూకోజ్ చపాతీల ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. ఇంకా పూరీలలో ఇది ఇంకా ఎక్కువ వేగంగా జరుగుతుంది. అంతే కాదు షుగర్ రాకుండా క్లోమ గ్రంధి విడుదల చేసే హార్మోన్స్ ఆగిపోతాయి. క్లోమగ్రంధి పనితీరు నెమ్మదిస్తుంది.

పాలు, పండ్లు

పాలు పండ్లు కలిపి తీసుకోకూడదు దీనివల్ల ముక్కు, చెవి, గొంతు సంబంధ సమస్యలు వస్తాయి. పాలల్లో ఉన్న కొవ్వులు, పండ్లలో ఉన్న చెక్కెరలతో జరిపే చర్య వల్ల అప్పటికప్పుడు సమస్య రాకపోయినా నిదానంగా చెవి సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది.

తేనె, నెయ్యి

తేనె, నెయ్యి రెండు అద్భుతమైన పదార్థాలు. అయితే రెండింటిని సమాన మోతాదులో కలిపి తీసుకోవడం వల్ల వాటి మధ్య జరిగే రసాయనచర్య వల్ల స్లో పాయిజన్ గా మారుతుంది. అందుకే చాలా చోట్ల వాటి మోతాదును ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ వినియోగిస్తారు.

ఆకుకూరలు, పాలు

చాలా మంది వంటల్లో పాలు పోసి కూర వంటడం అలవాటు చేసుకుంటారు అయితే పాలకు ఉప్పు తగలడం వల్ల పాలు విరిగిపోయి దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తానికి అందవలసిన ఆక్సిజన్ మలినం అవుతుంది. దీనివల్ల శరీరంలో చెడు రక్తం పెరిగిపోతూ అది ప్రమాద జబ్బులకు దారితీస్తుంది.

అరటిపండు, పెరుగు

ఒకటి పండు మరొకటి రసాయన చర్యకు లోనయ్యి పెరుగుగా మారిన పదార్థం ఇవి రెండూ కలవడం వల్ల అది జీర్ణాశయం లో పులిసిపోయి చర్మసంబంద వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. అంతే కాదు గ్యాస్ సమస్యలను కూడా వృద్ధి చేస్తుంది.

పాలు, చేపలు

పాలు చేపలు కలిపి వండటం వల్ల అది రుచికి చాలా బాగున్నా శరీరంలోకి వెళ్ళాక జీర్ణాశయపు గోడలను దెబ్బతీస్తుంది. అలాగే దీనివల్ల శరీరానికి చేరే శక్తి చర్మ రంద్రాలను దెబ్బతీసి అది క్రమంగా కుష్టు వ్యాధికి దారితీస్తుంది.

మాంసం, పెరుగు

చాలా మంది బిర్యానీ వండేటపుడు పెరుగులో మసాలా వేసి మాంసాన్ని నానబెడతారు దానివల్ల  మాంసానికి రుచి రావడం ఏమో కాని మాంసంలో ఉన్న కొవ్వులు పెరుగుతో రసాయన చర్య జరిపి అవి శరీరంలో చెడు కొవ్వులు తయారు చేస్తాయి. ఫలితంగా గుండెకు హానికరంగా మారతాయి.

చివరగా…….

రుచి కోసం చేసే ఏ పదార్థమైనా మొదట శరీరానికి మంచిదా కాదా అని తెలుసుకుని తరువాత తినడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చు లేకపోతే పైన చెప్పుకున్నవి అన్ని అప్పటికి సమస్యగా అనిపించకపోయినా స్లో పాయిజన్ గా మన ఆరోగ్యాన్ని కబలిస్తాయి.

Leave a Comment

error: Content is protected !!