శరీరంలో కొవ్వు పెరిగి అది రక్తనాళాలలో రక్తాన్ని అడ్డుకోవడం మొదలుపెడితే కొన్ని రోజులకు రక్తప్రసరణ మందగిస్తుంది. దీనివలన గుండె పనితీరు కుంటుపడుతుంది. అందుకే శరీరానికి అప్పుడప్పుడు కొన్ని డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ ఇవ్వడం వలన శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించి, అధిక బరువు సమస్యను కూడా లేకుండా చేస్తుంది. ఎన్ని రకాల వ్యాయామాలు చేసినా మనం తినే ఆహారం వలన కొవ్వు పేరుకుంటుంది.
ఈ కొవ్వు రక్తనాళాల గోడలకు అంటుకొని రక్తప్రసరణకు అడ్డుగా ఉంటుంది. ఈ కొవ్వు ఫలకాలు గుండెకు రక్తాన్ని సరఫరా కానివ్వకుండా అడ్డుగోడలా నిలుస్తాయి. దీనివలన మనకు గుండె పోటు వంటి సమస్యలు వస్తాయి. అందుకే తినే ఆహారంలో కొవ్వు తక్కువగా ఉండేలా సరైన వ్యాయామం, నడక కనీసం రోజులో కొంత సేపు అయినా అలవాటు చేసుకోవాలి. ఇక డీటాక్సిఫికేషన్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దాని కోసం మనం రెండు గ్లాసుల నీటిని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
దానిలో ఒక నిమ్మకాయ నాలుగు ముక్కలుగా కోసి వేసుకోవాలి. పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఒక ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి వేయాలి. ఇక చివరి పదార్థం దాల్చిన చెక్క పొడి చేసి రెండు చెంచాలు వేసుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగి సగం అయ్యేంత వరకు ఉంచాలి. తరువాత స్టవ్ ఆపేసి నీటిని చల్లారనివ్వాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టుకోవాలి. దీనిలో పావు చెంచా తేనె కలుపుకొని తీసుకోవాలి. ఆర్గానిక్ తేనె వాడితే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు తేనె వాడకుండా ఈ డ్రింక్ తీసుకోవాలి.
ఇందులో వాడిన పదార్థాలు అన్నీ శరీరంలో కొవ్వును కరిగించి రక్తాన్ని చిక్కపడకుండా అడ్డుకుంటాయి. అధిక బరువు సమస్యను తగ్గిస్తాయి. రక్తనాళాలలో కొవ్వు గడ్డలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.ఇలా గడ్డలు ఏర్పడితే అది రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కి కూడా కారణం కావచ్చు. ఈ డ్రింక్ ను మూడు వారాల పాటు క్రమం తప్పకుండా తాగి తరువాత ఒక వారం గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ మొదలు పెట్టి మూడు వారాలపాటు తాగవచ్చు. ఇలా క్రమం తప్పకుండా తాగడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి.