మనం మంచివి పాలు తీసుకుంటే లీటర్ 50-70 రూపాయల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ పాలతో మనం పెరుగు తయారు చేసుకున్నప్పుడు కొద్దిగా కాస్ట్ అవుతుంది. ఆ పాలు కూడా ఎక్కువగా కల్తీలు ఉంటున్నాయి. అంటే అందులో మందులు, యాంటీబయోటిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే గేదెలకు, ఆవులకు ఇంజక్షన్ చేస్తున్నారు కాబట్టి. కొంతమంది పెరుగులో కూడా కల్తీ కలుపుతూ ఉంటారు. కొంతమంది పాలల్లో కలుపుతారు. అసలు ఇలాంటి ఇబ్బంది లేకుండా మెమరీ బూస్టింగ్ కు చీప్ అండ్ బెస్ట్ పెరుగు ఇప్పుడు మనం చూద్దాం.
మన ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటాయి. నాలుగైదు కొబ్బరి చిప్పలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా నీరు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మిక్సీ తిప్పితే మెత్తగా నలిగిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఏదైనా గుడ్డ సహాయంతో బాగా వడకట్టుకోవాలి. ఆ పిప్పిని తీసేసి ప్యూర్ గా వచ్చే కొబ్బరిపాలను తీసుకోవాలి. ఈ కొబ్బరిపాలన్నిటిని ఏదైనా ఒక స్టీల్ గిన్నెలో పోసుకోవాలి. ఈ పాలను వేడి చేయడానికి డైరెక్ట్ గా గిన్నెతో సహా పెట్టి వేయకూడదు.
దీనికోసం డబల్ బాయిలింగ్ ప్రాసెస్ చేయాలి. అంటే ఏదైనా ఒక పెద్ద పాత్రలో కొన్ని నీటిని వేసుకుని అందులో ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకొని దానిపై పాలు పోసిన గిన్నె పెట్టి పాలను కొద్దిగా వేడి అయ్యేంతవరకు మరగనివ్వాలి. మరుగుతూ ఉండగా కలుపుతూ ఉండాలి. ఇలా పాలు మొత్తం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపి పాలను గోరువెచ్చగా అవ్వనివ్వాలి. ఆ తర్వాత పాలలో పచ్చిమిరపకాయల తొడుములు తోలచి తొడుములు రెండుమూడు పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేయాలి. ఇలా వేసి తోడు పెట్టేయండి.
ఇలా పెరుగు తోడుకుంటుంది. తోడుకున్న తర్వాత ఈ పెరుగును ఫ్రిజ్లో పెట్టుకుంటే గట్టిగా అవుతుంది. దీనిని మామూలు పెరుగుకు బదులుగా వడుకోవచ్చు. ఇది నాలుగు ఐదు రెట్లు తక్కువ రేట్ లో వచ్చేస్తుంది. కొబ్బరి పాలు పెరుగు అనేది మెమరీ బూస్టింగ్ చాలా మంచిది. ఇది పిల్లల జ్ఞాపకశక్తికి, పెద్దవారికి మతిమరుపు రాకుండా, మెదడు కణాలు కుసించకపోకుండా చేయడానికి ఈ పెరుగు చాలా హెల్ప్ చేస్తుంది. ఇది జీరో కొలెస్ట్రాల్ పెరుగు. యాంటీ ఆక్సిడెంట్ పెరుగు. చాలా రకాల పోషకాలు మరియు చాలా బలం. ఈ పెరుగు చాలా టేస్ట్ గా ఉంటుంది మరియు బెనిఫిట్స్ కూడా చాలా వస్తాయి…