శరీరంలో కాల్షియం లోపం రావడం వల్ల ఎముకలు బలహీన పడి కీళ్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ వస్తాయి. అలాంటప్పుడు క్రమం తప్పకుండా మూడు రోజులు దీన్ని తాగినట్లయితే శరీరంలో కాల్షియం లోపం తగ్గి ఎముకల బలహీనత తగ్గుతుంది. రోజు పని చేయడం వలన అలసట, నీరసం వస్తుంది. అలా నీరసం వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకండి. కాల్షియం లోపం కేవలం ముసలి వారిలో మాత్రమే కాకుండా చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, జాయింట్స్ నుండి శబ్దం రావడం అన్ని సూర్యకిరణాలు శరీరంపై పడకుండా ఇంట్లోనే ఎక్కువశాతం ఉండడం వల్ల కాల్షియం లోపం వస్తుంది. ఈ సమస్యలను మీరు ఎక్కువ రోజులు పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఎముకలు బలహీనపడటమే కాకుండా కళ్ళు, వెంట్రుకలు, చర్మం పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే ఆరోగ్యం విషయంలో అసలు అశ్రద్ధ వహించకండి.
పూర్వకాలంలో బాగా ముసలి వాళ్లకు కూడా ఎముకల బలహీనత వంటి సమస్యలు వచ్చేవి కాదు. ఇప్పుడు 30-40 సంవత్సరాల వయసులోనే బలహీనత వస్తుంది. దీనికి కారణం మనం తీసుకునే ఆహారం. కీళ్ల నొప్పులు, బలహీనత, నీరసం తగ్గాలంటే ఈ చిట్కా పాటించండి. ఒక కప్పు నువ్వులను తీసుకొని గ్రైండ్ చేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పొడిని ఏదైనా గాలి వెళ్ళని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.
ఈ పొడిని ఒక గ్లాస్ మామూలు వాటర్ లో ఒక చెంచా కలుపుకొని తాగాలి. లేదా ఒక స్పూన్ నువ్వుల పొడి తిని గ్లాసు నీళ్ళను కూడా తాగవచ్చు. నువ్వులలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి. నువ్వులు ఎముకల బలహీనతను తగ్గించి దృఢంగా చేస్తాయి. దీనితో పాటు బాదం కూడా తీసుకోవాలి. బాదం తీసుకోవడం వల్ల నీరసం తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.
బాదం ప్రోటీన్స్ టాబ్లెట్ వంటిది. బాదంను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే ఒక గ్లాసు పాలను బాదం పై పొట్టును తీసి నమలి తిని పాలను తాగాలి. లేదా బాదం పప్పులను పాలలో వేసుకొని పాలు తాగుతూ బాదం నమలి తినేయాలి. బాదం శరీరానికి కావలసిన ప్రోటీన్స్ అందించి శక్తినిస్తాయి. ఉదయం పూట బాదం ఇంకా పాలను తీసుకోవాలి. సాయంత్రం నువ్వుల పొడి, వాటర్ ను తీసుకోవాలి. ఇలా మూడు రోజులు చేసినట్లయితే ఎముకల బలహీనత, నీరసం తగ్గుతాయి.