7 days challenge for glowing skin

ఇది ట్రై చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది

 చాలామందికి ముఖం పై నల్లని మచ్చలు, బొంగు మచ్చలు, మొటిమలు, ఓపెన్ పోర్స్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటిని తగ్గించుకోవడానికి పార్లర్కు వెళ్లి రకరకాల ట్రీట్మెంట్స్  చేయించుకుంటారు. అయినప్పటికీ తాత్కాలిక  ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు ఫేస్ ప్యాక్స్  ఉపయోగిస్తారు. వీటిలో  కెమికల్స్ ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ ఫేస్ ప్యాక్ తయారుచేసుకుని ఉపయోగించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. 

         ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. దీని కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని రెండు చెంచాల పెరుగును వేసుకోవాలి. పెరుగు ముఖంపై ఉండే బొంగు మచ్చలు, నల్లని మచ్చలు, మొటిమలు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని తగ్గించడంలో కూడా పెరుగు చాలా బాగా సహాయపడుతుంది.  తర్వాత దీనిలో పావుచెంచా కస్తూరి పసుపు వేసుకోవాలి. కస్తూరి పసుపు చర్మ ఛాయను మెరుగు పరచడంలో సహాయపడుతుంది. అలాగే  బొంగు మచ్చలను తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. 

       తర్వాత అర చెంచా గ్లిజరిన్ వేసుకోవాలి. ఓపెన్ పోర్స్ బొంగు మచ్చలు, నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అరచెంచా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వద్దు అనుకున్న వాళ్లు క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ లేదా  టొమాటో జ్యూస్ వేసుకోవచ్చు. నిమ్మరసం మొటిమలను తగ్గించడంలోనూ, చర్మం క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ముఖంపై ఇన్ఫెక్షన్స్ ఉంటే  తగ్గించడంలో కూడా నిమ్మరసం బాగా సహాయపడుతుంది. ఒక చెంచా ఆరెంజ్ పీల్ పౌడర్ ను వేసుకోవాలి. 

         బయట మార్కెట్లో దొరికే ఆరెంజ్ పీల్ పౌడర్ కంటే నేచురల్గా మనం తయారుచేసుకున్న  ఆరెంజ్ పీల్ పౌడర్ మంచిది. ఇది ముఖం పై నల్ల మచ్చలు, మంగు మచ్చలు, మొటిమలు, ఓపెన్ పోర్స్ తగ్గించి ముఖం అందంగా, కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది.  వీటన్నిటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి పావుగంటసేపు ఉండనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ లేదా కొంచెం అలోవెరా జెల్ మరియు రెండు లేదా మూడు చుక్కల గ్లిజరిన్ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 

          ఈ ప్యాక్  వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కా మీకు కూడా అవసరం అనిపిస్తే ఒక సారి ట్రై చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!