స్త్రీలలో హార్మోనల్ ఇన్బాలన్స్, అధిక బరువు సమస్య వలన స్తనాల సైజ్ పెద్దగా ఉండి ఇబ్బంది పడుతుంటారు. ఏవైనా కొత్త డ్రెస్సులు ట్రై చేసినప్పుడు శరీరాకృతి ఇబ్బందిగా మారుతుంది. ఇలా బాధపడేవారికీ అధికబరువు లేదా వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు దీనికి కారణమవుతాయి. స్తనాల బరువు తగ్గించుకోవడానికి నాచురల్గా రెండు చిట్కాలు తెలుసుకుందాం.
మొదటి చిట్కా కోసం ఒక ఇంచ్ అల్లం ముక్కను తీసుకొని పైన చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. స్టౌపై ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకుని అవి మరిగిన తర్వాత తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత దీంట్లో ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి. ఇది బాగా మరిగి నీళ్ళు రంగు మారేంతవరకు ఉంచుకోవాలి.
ఇలా మరిగిన నీళ్లు కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి వడకట్టుకొని తాగాలి. భోజనానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఈ అల్లం నీటిని పీరియడ్స్ టైం లో తాగడం వలన రుతుక్రమంలో వచ్చే ఛాతీ, పొత్తికడుపు నొప్పి తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ నీటిలో తేనె వంటివి ఏమీ కలపవలసిన అవసరం లేదు. ఇలా భోజనానికి గంట ముందు తీసుకోవడం వలన మంచి ఫలితాలు చూస్తారు.
రెండవ చిట్కా కోసం అవిస గింజలు తీసుకోవాలి. అవిస గింజలు అన్ని సూపర్ మార్కెట్ లో, ఆన్లైన్ షాపులలో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలను మెత్తని పొడిలా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు.
ఇది కనీసం 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పొడిని రోజూ ఉదయాన్నే లేచిన వెంటనే లేదా సాయంత్రం పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీటిలో ఒక స్పూన్ పొడి కలిపి తాగడం వలన శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. ఇలా కనీసం ఏడు రోజులు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.