7 Diet Tips To Grow Hair Naturally

ఎంత పలుచటి జుట్టు అయినా సరే రాలకుండా ఒత్తుగా ఊహించలేనంతగా పెరుగుతుంది

ప్రస్తుత కాలంలో అందరికీ  జుట్టు రాలడం అనే సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. అది మనం తింటున్న ఆహారం, మన చుట్టూ వాతావరణం కూడా  కారణం కావచ్చు. ఈ చిట్కా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఈ చిట్కా ట్రై చేసినట్లయితే ఎంత  పలుచటి జుట్టు అయినా  ఒత్తుగా పెరగక మానదు. ఈ చిట్కా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. కావలసినవి ఉల్లిపాయలు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. అలాగే ఉల్లిపాయ జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది.  

 దీనికోసం తెల్ల ఉల్లిపాయలు తీసుకోకూడదు. మనం వంట కోసం వాడే పింక్ లేదా ఎరుపు రంగులో ఉండే ఉల్లిపాయలు మాత్రమే తీసుకోవాలి.  ఉల్లిపాయ కెరోటిన్ బాగా పెరిగేలా ఉపయోగపడుతుంది. రెండు ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని  గ్రైండ్ చేసుకోవాలి. దానిలో రెండు బిర్యాని ఆకులను కూడా  వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఉల్లిపాయలో  సల్ఫర్ అధికంగా ఉండడం వలన జుట్టు ఒత్తుగా పెరగడానికి బాగా పనిచేస్తుంది.

బిర్యానీ ఆకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. బిర్యానీ ఆకు కూడా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఈ పేస్ట్ లో ఒక గుడ్డు పూర్తిగా వేసుకోవాలి. పసుపు సొన కూడా కలుపుకోవాలి. దీనిలో 4 చెంచాలు  మీకు నచ్చిన ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకొని తలస్నానం చేసి 45 నిముషాలు ముందు తలకు పట్టించుకోవాలి. మాడుకి పూర్తిగా పెట్టిన తర్వాత ఇంకా మిగిలి నట్లయితే చిగుళ్ళకు కూడా పెట్టుకోండి.  
కుదుళ్ళ దగ్గర వేళ్ళతో నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలడం తగ్గుతుంది. గుడ్డు  చిట్లిన చిగుళ్లను సరిచేస్తుంది. ఇది అప్లై చేసి 45 నిమిషాల తర్వాత ఏదైనా హెర్బల్ షాంపూ లేదా  ఆయుర్వేద షాంపూతో తలస్నానం చేయాలి. 

ఇలా వారానికి రెండు సార్లు  అంటే మూడు రోజులకు ఒకసారి చొప్పున చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.  ఈ చిట్కా ట్రై చేస్తూ మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. సింపుల్ చిట్కా తో జుట్టు ఒత్తుగా, పొడవుగా చేసుకోండి.  ఈ చిట్కాతో రూపాయి ఖర్చు లేకుండా మీ జుట్టు పొడవుగా పెంచుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!