7 Emerging Benefits and Uses of Papaya Leaf

తెల్లజుట్టుని శాశ్వతంగా ఒక నెలలో పూర్తిగా నల్లగా మార్చుకోవచ్చు

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల్లో కూడా ఒత్తిడి వలన తెల్ల వెంట్రుకలు సమస్య మొదలవుతుంది. పెద్దవారిలో కాలుష్యం, ఒత్తిడి, మానసిక ఆందోళన వలన జుట్టు సమస్యలు వస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు సమస్యలు తగ్గించడంతోపాటు జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో కూడా సహాయ చేస్తుంది. ఈ చిట్కా కోసం మనం మగ బొప్పాయి చెట్టు నుండి తెంచిన ఆకులను తీసుకోవాలి. మగ బొప్పాయి చెట్టు అంటే కాయలు లేకుండా పొడవైన కాడలతో పువ్వులు కలిగి ఉంటుంది.

 ఈ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కొయ్యాలి. వీటిని మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీటితో మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఒక పలుచని క్లాత్ లేదా వడకట్టు సహాయంతో ఫేస్ట్ను వడకట్టి బొప్పాయి ఆకుల రసాన్ని సేకరించాలి. ఈ జ్యూస్ లో ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకోవాలి. ఏ బ్రాండ్ కాఫీపొడి అయినా పరవాలేదు తర్వాత ఒక స్పూన్ హెన్నా పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవాలి.  వీటిని బాగా కలిపి ఒక దూది సహాయంతో జుట్టు కుదుళ్లకు ఈ మిశ్రమాన్ని బాగా అప్లై చేయాలి. ఒక గంట తర్వాత హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి.

 ఇందులో వాడిన ఆకులు జుట్టు నల్లగా చేయడానికి జుట్టు రాలకుండా అడ్డుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. కాఫీ పొడి జుట్టు నల్లగా చేయడంలో సహాయపడుతుంది. జుట్టు నల్లగా రావడానికి కావలసిన రంగును కాపాడే లక్షణాలు కాఫీపొడిలో పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును మెరిసేలా చేయడంలో కూడా పనిచేస్తుంది. హెన్నా పౌడర్ జుట్టును మృదువుగా చేయడానికి ఆరోగ్యంగా పెరగడానికి జుట్టు నల్లగా ఉండేందుకు సహాయపడటంలో అద్భుతమైన ప్రయోజనాలు చూపిస్తుంది.

ఇక ఇందులో వేసిన ఆలివ్ ఆయిల్ జుట్టు కోల్పోయిన తేమను అందించి జుట్టు చిక్కులు పడకుండా పొడిబారకుండా ఉండటంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ హెయిర్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు తప్పకుండా ప్రయత్నించి చూడండి. జుట్టు నల్లగా మారడం లో ఇది మీకు చాలా బాగా సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!