7-Health-Benefits-of-Drinking-Coconut-Water

మీరు కొబ్బరి బొండం తాగుతుంటే ఇది తప్పక చదవండి.

వేసవికాలం వచ్చిందంటే చాలామంది ఐస్ క్రీమ్ షాపులు, కూల్ డ్రింకులు వదిలి క్యూ కట్టేది కొబ్బరి బొండం కొట్టు దగ్గరకే. కేవలం వేసవి కాలం మాత్రమే కాదు, ఏ కాలంలో అయినా కొబ్బరి నీటిని నిరభ్యరంతంగా తీసుకోవచ్చు. పొడిబారిన నోటికి, అలసిన శరీరానికి కొబ్బరి బొండం తాగడం వల్ల అమృతమంటే ఇలాగే ఉంటుందేమో అనే భావన కలగడం సహజం. కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. ఇందులో ఫ్యాట్లు అసలు ఉండవు. తీపి రుచి వల్ల కొద్దిపాటి క్యాలరీలు ఉంటాయి. శరీరం డీహైడ్రేట్ అవ్వడాన్ని కొబ్బరి బొండం అరికడుతుంది. ఇంతటి కొబ్బరి బంధం వల్ల ఇంకా బోలెడు ఉపయోగాలు ఉన్నాయ్ ఒకసారి చూశారంటే శాశ్వతంగా కూల్డ్రింకులు వదిలి కొబ్బరి బొండం కె ఓటు వేస్తారు చూడండి మరి.

◆కొబ్బరి బొండం నీటిలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొబ్బరి నీటిని రోజువారీ తీసుకుంటే మన జీర్ణక్రియ రేటు పెరిగి పొట్ట పిరుదులు వంటి ప్రాంతాల్లో పెరిగిన కొవ్వులను కరిగించి అధిక బరువు తగ్గడానికి కారణమవుతుంది. అంతే కాదు ఆకలిని దరిచేరనివ్వదు.అంటే ఇప్పటికే అర్థమైందిగా బరువు తగ్గాలి అనుకునేవారు రోజువారీ తీసుకునే డైట్ మెనూ లో కొబ్బరి నీళ్లు చేర్చుకోవడం ఉత్తమం. 

◆చాలామందిలో నీటిని సరైన మోతాదులో తీసుకోకపోవడం అనే సమస్య ఉంటుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతే కాదు నీరు తక్కువగా తీసుకునే వారిలో కనిపించే కిడ్నీలో రాళ్ళ సమస్యను కొబ్బరి బొండం ద్వారా అరికట్టవచ్చు. కోబ్బఈ నీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల కిడ్నీలలో ఏర్పడిన రాళ్లు క్రమంగా కరిగిపోతాయి.

◆ప్రతి చిన్న జబ్బు తొందరగా తగ్గిపోకుండా అలాగే ఒకదాన్నుండి మరొక సమస్య  పుట్టుకొచ్చి అనారోగ్య సమస్యకు దారి తీస్తుంటే రోగనిరోధక శక్తి లోపించినట్టు చెప్పవచ్చు. కొబ్బరి నీళ్లలో ఆమ్ల జనకాలు మరియు ఫ్రీరాడికల్స్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

◆కొబ్బరి నీళ్లలో దాగిన ఒక అద్భుతమైన విషయం తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ నీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అందే మెగ్నీషియం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. అంటే డిప్రెషన్ భూతాన్ని తరిమికొట్టగల గొప్ప మెడిసిన్ గా కొబ్బరి బొండం ను వర్ణించవచ్చు.

◆కొబ్బరి నీళ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలు పెళుసుబారి బాధపడుతున్న వారు కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా వెన్నుపూసను పటిష్టం చేస్తుంది.

◆చిరుతిళ్ల రూపంలో బయట తినే పదార్థాల వల్ల  శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను నిర్మూలించే శక్తి కొబ్బరి నీళ్లకు ఉంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల రక్త ప్రసరణ సమర్థవంతంగా నిర్వహించబడి గుండెకు మేలు చేస్తుంది.

◆జ్వరం, అతిసారం, జబ్బులు చేసినపుడు నీరసంగా ఉన్నపుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు

చివరగా…..

కొబ్బరి నీరు కేవలం ఔషధంగానే కాకుండా ప్రతీరోజు లేదా తరచుగా తీసుకోవడం వల్ల చర్మంపై వయసు పరంగా వచ్చే ముడుతలు నిర్మూలించి యవ్వనంగా ఉంచుతుంది. అంతేకాదు నూతనోత్తేజాన్ని నింపుతుంది. కాబట్టి కూల్డ్రింకుల వెంట పడటం మాని కొబ్బరి బొండం కె మీ వోటు వేయండి. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!