మనదేశంలో ప్రతిరోజూ చేసే వంటకాలలో చింతపండు లేనిదే గడవదు. అలాంటి చింతపండును మనదేశ ఖర్జూరంగా పిలుస్తారు. చింత పండు వలన వంటలకు రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే చింతపండును వంటల్లో ఉపయోగించేటప్పుడు వాటి విత్తనాలను బయట పారేస్తూ ఉంటాం. ఈ చింతపిక్కలలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, వీటికి ఇతర దేశాలలో చాలా డిమాండ్ ఉంటుందని మనకు పెద్దగా అవగాహన ఉండదు. కానీ ఈ చింతపిక్కలలో ఉండే ఆరోగ్యప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి చింతపిక్కలు చాలా బాగా పనిచేస్తాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకుందాం. చింత పిక్కలను డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నీటిని మార్చుతూ మూడవరోజు దాని పై పొట్టు తీసేయాలి. బాదం నానపెట్టినప్పుడు ఎలా అయితే వస్తుందో అలా దీని పొట్టు కూడా వచ్చేస్తుంది. తర్వాత చిన్న ముక్కలుగా చేసుకుని ఎండలో బాగా ఆరబెట్టాలి. బాగా ఆరిన చింత గింజలను మిక్సీ పట్టి మెత్తని పొడిగా చేసుకొని ఒక గ్లాస్ జార్లో నిల్వ చేసుకోవాలి.
కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ తగ్గించుకోవడానికి ఈ చింతపిక్కల పొడిని ఉదయం, సాయంత్రం అరస్పూను చొప్పున పాలలో లేదా నీళ్లలో కలిపి తీసుకోవచ్చు. అలా తీసుకోలేని వారు పంచదార లేదా నెయ్యి కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వలన చింతపిక్కలలో ఉండే ఔషధ గుణాలు త్వరగా కీళ్లనొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది మరియు అరిగిపోయిన గుజ్జు తిరిగి పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులను శాశ్వతంగా దూరం చేస్తుంది. ఈ చింత పిక్కల పొడి కీళ్ల నొప్పులకే కాకుండా దంత సమస్యలు, డయేరియా, అజీర్ణం, చర్మంపై దురదలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ పొడితో పళ్ళపొడిలా ఉపయోగించి దంతధావనం చేయడం వలన పళ్ళపై గార తగ్గుతుంది. పొగ తాగే వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.
కూల్ డ్రింక్ లు ఎక్కువగా తాగేవారు, పాన్ ఎక్కువగా తినేవారు చింతపిక్కల పొడితో తోమడం వలన పళ్లపై పేరుకున్న పచ్చటి మరకలు తొలగిపోతాయి. అనేక దీర్ఘ కాలిక వ్యాధులను తగ్గించడంలోనూ డయాబెటిస్, బ్రాంకైటిస్, శ్వాస సంబంధ వ్యాధులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా విరిగిన ఎముకలపై ఈ చింతపిక్కల పొడిని పేస్ట్లా చేసి అప్లై చేయడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. చింతపిక్కలలో అరుదుగా లభించే టానిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది చాలా తక్కువ ఆహార పదార్ధాల్లో లభిస్తుంది.
కొంతమందిలో వెన్ను నొప్పి బాధిస్తుంటుంది. గర్భధారణ సమయంలో కూడా ఈ నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు ఈ చింతపిక్కల పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలకు కూడా ఇలా పాలలో కలిపి తీసుకోవడం మంచి నివారణ ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న చింతపిక్కలను ఇకపై పారేయకుండా మీ ఆరోగ్య రక్షణ ఉపయోగించుకోండి.
Exlent