7 Natural Remedies for Your Burning Stomach

కడుపులో మంటతో ఇబ్బంది పడుతున్నారా?? ఈ చిట్కాలు పాటించండి.

చాలామందిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య కడుపులో మంట. ఈ కడుపులో మంట రావడానికి కారణం మనమే అంటే ఆశ్చర్యమేస్తుంది కానీ ఇదే నిజం. కాలం నెపంతో మార్చుకుంటున్న ఆహారపదార్థాల వినియోగం, సమయవేళలు మొదలైనవి కడుపులో మంటకు దారితీస్తున్నాయి. ఈ సమస్య వల్ల రోజు మొత్తం ప్రభావితం అవుతుంది కాబట్టి దీన్ని అధిగమించడానికి కొన్ని సహజ చిట్కాలు.

◆అరటి పువ్వు, అరటి కాయలకు కడుపులో మంట, అల్సర్లను తగ్గించే గుణం ఉంది పేగులు వ్యాధి తో బాధపడేవారిలో కడుపు మంట అనేది సహజంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు అరటిపండుకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

◆ ధనియాలను చిక్కని కషాయంగా తయారుచేసుకుని అరగ్లాసు వరకు తాగితే ప్రతి రోజూ  అల్సర్లు తగ్గుముఖం పడతాయి. వేధిస్తున్న కడుపు మంట కూడా క్రమంగా నెమ్మదిస్తుంది.

◆ ఆయుర్వేద షాపుల్లో యష్టి చూర్ణం, త్రిపల చూర్ణం అనే ఔషధాలు దొరుకుతాయి.  ఈ రెండింటిని సమానంగా తీసుకుంటే మంట తగ్గుతుంది, ఒక వేళ పేగు పూత ఉన్నట్లయితే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.

◆ అప్పటికప్పుడు పిండిన పాలు గోరు వెచ్చగా ఉంటాయి. వీటిని గుమ్మపాలు అంటారు. ఈ గుమ్మపాలను  తాగితే కడుపులో మంట ఉపశమిస్తుంది.

◆ పత్తి గింజల్ని మెత్తగా దంచి పొడి చేసి, ఈ పొడిని తేనెలో కలిపి పావు చెంచా మోతాదులో తీసుకుంటే కడుపులో మంట, అధిక వేడి వల్ల కలిగే ఇబ్బంది అన్ని తగ్గుతాయి.

◆ కడుపు మంట తగ్గించే గొప్ప ఔషధం ఉదయ భాస్కర రసం అనే ఔషధం. ఈ ఔషదానికి కడుపులో  ఆమ్లాలను తగ్గించే గుణం కలిగిన క్షారాలు ఉన్నాయి. ఇది కడుపులో  మంట, పొట్టలో నొప్పి తగ్గించి, పేగు పూత త్వరగా మానిపోయలా చేయడంలో దోహాధం చేస్తుంది.

◆ వట్టి వేళ్ళు, సుగంధి పాలు, లవంగాలు, యాలకులు, అతిమధురం,  జాజికాయ, జాపత్రి మొదలైన వాటిని సమపాళ్లలో తీసుకోవాలి. వీటిని మెత్తగా నూరి కొద్దిగా పచ్చ కర్పూరం వేసిన పొడిని పావు చెంచా  మోతాదులో తేనెతో కానీ, పాలలో కానీ వేసుకుని తాగుతూ ఉంటే ఎంతో కాలం వేధిస్తున్న కడుపు మంట కూడా తక్షణమే తగ్గిపోతుంది. సుగంధి పాల వేర్లు లోపల పుల్ల తీసివేసి బెరడును తీసుకోవాలి. 

◆  కడుపులో మంట తగ్గడానికి పలుచటి మజ్జిగ తీసుకోవడం ఉత్తమం. రోజులో అపుడపుడు పలుచగా ఉన్న మజ్జిగ గంటకు ఒకసారి లేదా రెండు గంటలకు ఒకసారి తాగుతూ ఉండాలి. మజ్జిగలో పేగుల ఆరోగ్యాన్ని సంరక్షించే బాక్టీరియా ఉంటుంది ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది.

◆ తాజా పళ్ల రసాలు చలువ చేసే ఆహారపదార్థాలు ముఖ్యంగా సొంపు కషాయం వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి తొలగిపోయి కడుపు నొప్పి, కడుపులో మంట తగ్గుతాయి.

చివరగా……

కడుపునొప్పి, కడుపులో మంట తగ్గడానికి పైన చెప్పుకున్న చిట్కాలనే కాకుండా ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి. అతి కారం, అతి పులుపు, మసాలాలు మొదలైనవి ఆహారం జాబితా నుండి దూరంగా ఉంచాలి. ఇలా చేస్తూ ఉంటే కడుపు మంట తోక ముడిచి పారిపోతుంది.

Leave a Comment

error: Content is protected !!