బొప్పాయి లేదా పరిందకాయ విరివిగా లభించే పండు. ఇది గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అయితే చాలామందికి దీని గూర్చి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. కానీ ఇపుడు చెప్పుకోబోయే నిజాలు చూస్తే విస్తుపోవడం ఖాయం. అంత విస్తుపోయే నిజాలు ఏమిటా అని మీరు ఆలోచించక్కర్లేదు దిగువ చదివితే మీకే తెలుస్తుంది నిజమెంతో.
◆ ప్రసావనంతరం బాలింతలకు బొప్పాయి చాలా మేలు చేస్తుంది. దోర బొప్పాయిని కూరగా వండుకుని ఆహారంలో తీసుకుంటే బాలింతల్లో పాలు సమృద్ధిగా పడతాయి.
◆ బొప్పాయిని తినడం వల్ల ప్రసవం అయిన వారిలో వధులైపోయిన గర్భసంచి కండరాలు తిరిగి పటిష్టం అవుతాయి.
◆ లేత బొప్పాయి కాయను కుమ్ములో పెట్టి ఉడికించి పేస్ట్ లా చేసి రొమ్ముపై కడితే రొమ్ములలో గడ్డల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
◆ నెలసరి సరిగా రాని స్త్రీలు బొప్పాయిని వండుకునికానీ, కూరగా గానీ తింటే నెలసరి సక్రమంగా వస్తుంది. పచ్చి బొప్పాయిని గర్భవతులు తినకూడదు.
◆ బొప్పాయి చెట్టుకు కానీ, కాయకు కానీ సన్నగా గీత పెడితే పాలు కారతాయి, ఈ పాలను చిన్న గ్లాసులో పట్టుకుని వీటికి సమానంగా పంచదార కలిపి పూటకు 20 చుక్కలు చెప్పున మూడు పూటలా తీసుకుంటే ఎలాంటి అజీర్తి అయినా తగ్గిపోతుంది మరియు పేగు పూత వ్యాధిలో బాగా పనిచేస్తుంది.
◆ జిగురు విరేచనాలు, మలబద్దకం, ఆకలి లేకపోవడం, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలకు కూడా బొప్పాయిని నిరభ్యరంతంగా వాడుకోవచ్చు.
◆ బొప్పాయి చెట్టు లేదా కాయ నుండి సేకరించిన పాలలో కొద్దిగా నీరు కలిపి పలుచగా చేసి గజ్జి, తామర వంటి మచ్చలపై రాస్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
◆ బొప్పాయి ఆకులు లేదా కాయను కానీ మెత్తగా దంచి పేస్ట్ లా చేసి అరికాళ్ళ ఆనేమీద కడితే ఆనెలు మెత్తబడతాయి.
◆ గవదబిళ్ళలు, సిఫిలిస్ వంటి సుఖవ్యాధులలో కలిగే వాపులను తగ్గించడంలో బొప్పాయి అత్యుత్తమంగా పనిచేస్తుంది.
◆ బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరిగి, మలబద్దకం మరియు పేగు సంబంధ సమస్యలు అన్ని తగ్గుతాయి.
◆ ఇది చర్మానికి తేమను అందించి మృదువుగా ఉంచుతుంది కాబట్టి దీన్ని తరచుగా తినేవారిలో చర్మం కాంతివంతగా ఉంటుంది.
◆ ఇందులో ఫైబర్ మరియు తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మరియు శరీరానికి పోషకాలను అందించడం వల్ల అందరికి ఇష్టమైన పండు జాబితాలో ఒకటిగా తప్పక నిలుస్తుంది.
◆ బొప్పాయి శరీరంలో ఎర్రరక్తకణాల అభివృద్ధికి తోడ్పడే హిమోగ్లోబిన్ ను పెంచడంలో తోడ్పడుతుది. అలాగే బొప్పాయి ఆకుల రసం కూడా రక్తంలో ప్లేట్లెట్స్ ను పెంచడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
చివరగా…..
చిన్న నాటి బాల్యం నుండి నేటి వరకు బొప్పాయి ప్రయోజనాలను చేకూరుస్తూనే ఉంది. అంతేనా మనకు తెలియని బోలెడు రహస్యాలను కూడా దాచుకుంది. వాటి తాలూకూ ప్రయోజనాలు పొందాలని అనుకుంటే బొప్పాయిని తినాల్సిందే మరి.