ప్రస్తుత కాలంలో అందరికీ నిద్రలేమి సమస్య చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణం పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఫోన్లు ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. అన్ని సమస్యలను తగ్గించుకోవడానికి రకరకాల మందులను ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది అయితే నిద్రమాత్రలు కూడా వేసుకుంటారు. కానీ నిద్ర మాత్రలు ఉపయోగించడం వల్ల కాలక్రమేణా సమస్యలు వస్తాయి.
ఎటువంటి మందులు ఉపయోగించకుండా ఈ చిన్ని చిట్కాలతో నిద్రలేమి సమస్యను తగ్గించుకోవచ్చు. నిద్రలేమి సమస్యలు తగ్గించుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 10 నుంచి 20 రూపాయల ఖర్చులోనే గాఢనిద్రను కలిగించే వాటిని కొనుక్కోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్బూజా గింజలు ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. ఇవి మార్కెట్లో, కిరాణా షాప్ లలో, సూపర్ మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ సులభంగా దొరుకుతాయి.
వీటి ఖరీదు కూడా తక్కువగా ఉంటుంది. వీటిని ఫ్రెష్ గా ఉండే వాటిని తెచ్చుకోవాలి. రోజుకు ఒక చెంచా ఖర్బూజా గింజలను తీసుకుని డ్రై పాన్ లో వేసుకుని రంగు మారే వరకు లో ఫ్లేమ్ లో పెట్టి దగ్గరుండి వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి ముందు ఈ
గింజల్ని కూర్చొని రెండు రెండు చొప్పున నెమ్మదిగా నములుతూ తినాలి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని ఒక చెంచా గంధపు పొడి వేసుకుని కొంచెం నీళ్ళు పోసి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని నుదుటిపై అప్లై చేసుకోవాలి. మిశ్రమాన్ని అప్లై చేసుకొని ఖర్బూజా గింజలను రెండు రెండు చొప్పున తినడం వలన వెంటనే ఘాడ నిద్ర లోకి వెళ్తారు. ఈ చిట్కా కేవలం ఒక పది రోజులు చేసి తర్వాత ఆపేయాలి. మీరు లక్షలు ఖర్చు పెట్టినా రాని నిద్ర ఈ చిట్కా ట్రై చేసిన వెంటనే వస్తుంది. ఈ చిట్కాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గాఢ నిద్ర వలన శరీరంలో అనేక రోగాలను కూడా తగ్గించుకోవచ్చు. నాకు నిద్ర పట్టట్లేదు ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన ఇదే పరిస్థితి అనుకునేవారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది.