ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల. తల్లి కావచ్చు చెల్లి కావచ్చు కూతురు కావచ్చు, కోడలు కావచ్చు ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఒక కళ. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోనూ కాస్తో కూస్తో బంగారం ఉంటుంది. అడపాదడపా వెండి ఉంటుంది. అమ్మాయిల అందం ను ద్విగుణీకృతం చేసేవి ఆభరణాలు అని అందరికి తెల్సినదే. అయితే ఆభరణాలు అన్ని అమ్మాయిలు అలంకరించుకోడానికే పుట్టుకొచ్చినవి కావు. వీటి వెనుక ఎంతో సైన్స్ దాగుందంటారు పెద్దలు మరియు ప్రాచీన వైద్యులు. ప్రతి అమ్మాయి ఇంట్లో నడుస్తుంటే ఘల్లు ఘల్లు మని ఇల్లంతా శబ్దం వస్తూ ఇంట్లో సందడి నెలకొంటుంది. అలాంటి అనుభూతికి కారణం కాళ్లకు వేసుకునే పట్టీలు. మువ్వలు పట్టీలు, అందియలు పేర్లు ఎన్నైనా ఇవి అమ్మాయిలకు ఇచ్చే ఆకర్షణ, అందం అంతా ఇంతా కాదు. అయితే కేవలం అందం ఆకర్షణే కాదు అందులో సైన్స్ కూడా ఒకసారి తెలుసుకుంటే బెస్టు అంటున్నారు పెద్దలు. ఎందుకంటే ఇప్పటి ఫాషన్ ప్రపంచంలో అమ్మాయిలు పట్టీలు పెట్టుకోడం అరుదు అయిపోయింది. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు వంటి ప్రత్యేక దినాల్లో ట్రెడిషల్ డ్రెస్సింగ్ లో ఉన్నపుడు మాత్రమే పట్టీలు కూడా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. మిగిలిన దినాల్లో అసలు వాటి వైపు కూడా చూడరు. కానీ వాళ్ళు ఏం కోల్పోతున్నారు వాళ్లకు అర్థం కావట్లేదు. అందుకే పట్టీల వెనుక దాగున్న కొన్ని నిజాలు అది కూడా సైన్స్ ఆధారంగా విశ్లేషిద్దాం రండి.
◆సాధారణంగా ఆర్థిక స్థోమతను బట్టి వెండి లేదా బంగారు పట్టీలను అమ్మాయిలు దరిస్తూ ఉంటారు. బంగారం మరియు వెండి అనేవి లోహాలు అని మనకు తెలిసినవే. అయితే ఇవి శరీరానికి ఏ విధంగా మేలు చేస్తాయి అంటే చూడండి మరి.
◆చరిత్రను పరిశీలించి చూస్తే ఒకప్పుడు మగవాళ్ళు కూడా ఆభరణాలు ధరించేవారు. మన శరీరంలో కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు పెద్దలు. నుదుటన బొట్టు, చేతికి గాజులు, కాళ్లకు పట్టీలు, చెవులకు దుద్దులు, ముక్కుకు ముక్కెర ఇలా ప్రతి భాగానికి ఒకో ఆభరణం. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో మన శరీరంలో మొత్తం అనుసంధానమై ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి. ఆ వత్తిడి వల్ల మన శరీరంలో కొన్ని హార్మోనులు విడుదల అవుతూ అక్కడ ప్రయాణించే నరాల వ్యవస్థను ఉత్తేజితం చేస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు మరియు మన శరీరంలో కలిగే దోషాలను అంతమొందించేందుకు దోహదపడతాయి.
◆కాళ్లకు ధరించే పట్టీలు 90% వెండివే. వెండి మన శరీరానికి తగిలినపుడు జరిగే రసాయన చర్య మరియు విడుధల అయ్యే ఎలాక్ట్రనులు కాళ్ళ భాగం లో ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి. దీని ద్వారా నరాలలో విద్యుత్ ప్రవహించి శరీరంలో ఉన్న అసమతుల్యతలను క్రమబద్ధీకరణ చేస్తుంది.
◆మన శరీరం కొన్ని ప్రాంతాల్లో ఉన్న నరాలను ఇలా ఒత్తిడికి గురి చేసి వాటిని ఆక్టివేట్ చేయడాన్ని వైద్యభాషలో ఆక్యుపంక్చర్ అంటారు.
◆కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల మన శరీరంలో త్రిగుణాలుగా పిలువబడే వాత పిత్త కఫ దోషాలను అదుపులో ఉంచుతుంది.
◆ముఖ్యంగా మహిళల్లో ఎదురయ్యే గర్భసంచి కి సంబంధించిన సమస్యలను తగ్గించి గర్భసంచి ఆరోగ్యం కాపాడటంలో కాళ్ళ పట్టీల ప్రాధాన్యత చాలా ఉంది.
◆ఇప్పటి కాలంలో చాలా మంది అమ్మాయిలతో ఎదురవుతున్న సమస్య పీరియడ్స్ సరిగా రాకపోవడం. అయితే 90% అమ్మాయిలు కాళ్ళ పట్టీలను రెగులర్ గా ధరించడానికి ఇష్టపడటం లేదు. అందుకే వాళ్లకు ఈ సమస్యలు. పట్టీలు ధరించడం వల్ల నెలసరి సమస్యలను కూడా సులువుగా అధిగమించవచ్చు.
◆అడవాళ్ళలో ఉన్న మానసిక ఒత్తిడిద్వారా ఉత్పన్నమవుతున్న హార్మోన్ ఇంబాలెన్సు కూడా కాళ్లకు పట్టీలను ధరించడం ద్వారా నియంత్రించవచ్చు.
చివరగా…..
పట్టీలు కేవలం అందం కోసమే కాకుండా మహిళలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో భాగం కూడా అనుకుని ఇప్పటికైనా అలవాటు మానుకున్న వాళ్ళు తిరిగి ధరించడం మొదలు పెడితే అందం తో పాటు ఆరోగ్యం కూడా మహిళల సొంతమవుతుంది.