7 Reasons You Are Always Tired

మిమ్మల్ని రోజంతా అలసటగా ఉంచే ఈ 7 కారణాలను తరిమికొట్టండి.

తగినంత నిద్ర లేకపోవడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. రోజువారీ పనులు మొదలు పెట్టి ముగించి ఎన్నో చేస్తుంటాం. అయితే చాలామందిలో పెద్ద పనులు చేయకపోయినా చిన్న చిన్న పనులకే తొందరగా అలసిపోతుంటారు. రోజులో ఎన్ని పనులు చేస్తున్నా అవన్నీ కూడా నిస్సారంగా, ఉత్సాహం లేకుండా, చేయాలి కాబట్టి చేయాలి అన్నట్టు చేస్తుంటారు. ఇలాంటి ఉత్సాహం లేకుండా రోజు మొత్తం అలసిపోయినట్టుగా  శరీరాన్ని ఆవరించే నీరసానికి కొన్ని సార్లు కారణాలు అంతుపట్టవు. 

రోజు మొత్తం మనల్ని నీరసంగా ఉంచే కారణాలు కొన్ని ఉన్నాయి అవేంటో ఒకసారి తెలుసుకుని వాటిని అధిగమిస్తే  రోజంతా చురుగ్గా ఆడుతూ….. పాడుతూ పని చేసేసుకుంటాం. మరి అవేంటో చదవండి.

 1. రక్తహీనత

 రక్తహీనత ప్రధాన లక్షణం అన్ని సమయాలలో మనల్ని అలసిపోయినట్లు ఉంచడం.  ఎర్ర రక్త కణాలు సరిపడినంత లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది, దీనివల్ల శరీరంలోని వివిధ అవయవాలు మరియు కణజాలాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. అందువల్లనే ఏదైనా పని చేసినా చేయకపోయినా కొద్దిపాటి పని చేసినా రోజు మొత్తం అసలిపోయినట్టు, నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

దీనిని అధిగమించాలంటే శరీరంలో రక్తాన్ని వృద్ధిచేసుకునేట్టుగా ఆహారాన్ని తీసుకోవాలి. రక్త వృద్ధికి తోడ్పడే పండ్లు, కూరగాయలు, తాజా ఆకుకూరలు వంటివి తీసుకోవాలి. 

 2. తక్కువ రక్త చక్కెర స్థాయి

 మన శరీరంలో అన్ని మూలకాలు ఎలా ఉంటాయో చక్కెర కూడా అలాంటివాటిలో ఒకటి.  రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యతలో ఉండటం అన్నిటిలోకి ముఖ్యమైన అంశం. ఈ చెక్కెరలు అధికమోతాదులోకి వెళ్తే డయాబెటిస్ కు కారణం అవుతుంది. అదే చక్కెర స్థాయి తక్కువగా ఉంటే శరీరం నీరసానికి లోనవుతుంది.

 కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను అధికంగా కాకుండా అత్యల్పంగా కాకుండా సమతుల్యతలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

 3. థైరాయిడ్ గ్రంథి

శరీరంలో థైరాయిడ్ గ్రంథి అసమతుల్యత అలసటను కలిగిస్తుంది.  ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ జీవక్రియను సంరక్షిస్తుంది. అలాంటి ఈ  హార్మోన్ తక్కువ ఉత్పత్తి అయితే మొదటగా అలసిపోయేలా చేస్తుంది.  ఎంత నిద్రపోయిన కూడా అసలు నిద్రపోనట్టు అనిపించడం దీని ప్రభావమే.

 4. డిప్రెషన్

 నేటి కాలంలో వేధిస్తున్న పెద్ద సమస్య డిప్రెషన్. మానసిక వత్తిడిగా పిలుచుకునే ఇది చాలా సున్నితమైన మరియు చాలా అపాయకరమైన సమస్య. డిప్రెషన్ మానసిక స్థితిని మాత్రమే కాకుండా, నిద్ర, ఆహారపు అలవాట్లు మొదలైనవాటిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ మానసిక అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది సంవత్సరాల పాటు వేధిస్తూనే ఉంటుంది. 

సమస్యను గుర్తించుకుని యోగ, ధ్యానం వంటివి ఆచరిస్తూ ఈ సమస్య నుండి మెల్లిగా బయటపడవచ్చు. 

 5. నిద్రలో గురక

 ఇది తీవ్రమైన అనారోగ్యం, ప్రజలలో సరైన అవగాహన లేదు.   నిద్రలో శ్వాసకు అంతరాయం ఏర్పడినప్పుడు ఇది జరుగుతుంది. .  నిద్రలో సరైన శ్వాశ అందకపోవడం గురక పెట్టడం జరుగుతుంది. ఈ గురక దీర్ఘకాలంగా సాగడం వల్ల శ్వాసనాళాలు, ఊరితిత్తుల వ్యవస్థ అలసిపోయి ఉంటుంది. ఇది పగటి సమయం మొత్తం ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తుంది. ఈ గురక అనే సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది స్ట్రోక్‌లకు దారితీసె అవకాశం కూడా ఉంటుంది.

 6. సరైన ఆహారం లేకపోవడం.

 తీసుకునే ఆహారం కూడా శారీరక సమర్త్యాన్నీ నిర్ణయిస్తుంది. అలసట, నిరుత్సాహం అనేవి ఆవరించేలా చేస్తుంది. శరీరానికి తగినన్ని పోషకాలు అందాలంటే బలవర్థకమైన ఆహారం అవసరం. ఎప్పుడైతే ఆహారం సరిగా తీసుకోలేకపోతామో, శరీరంలో వివిధ అవయవాలకు కావలసిన శక్తి అందక వాటి పనితీరు చాలా నెమ్మదిగా ఉంటుంది. దీనివల్ల కొద్దిపాటి పని చేయడం, రోజంతా శరీరాన్ని నీరసం అంటిపెట్టుకుని ఉండటం జరుగుతుంది. అందుకే తీసుకునే ఆహారం సమర్థవంతంగా ఉండాలి.

 7. డీహైడ్రేట్ అవ్వడం

 శరీరానికి నీరు అవసరం అనే విషయం అందరికి తెలిసినదే.  రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలని నిపుణుల నుండి ప్రతి ఒక్కరు చెబుతూనే ఉంటారు. అయితే చాలామంది నీటిని తీసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనేది కాదనలేని నిజం. శరీరంలో తగినంత నీటి స్థాయిలు లేకపోతే డీహైడ్రేట్ చేస్తుంది. దీనివల్ల తొందరగా అలసట, నీరసం ఆవరిస్తాయి.  అంతేకాదు ఇది శారీరక పనితీరును కూడా దెబ్బతీస్తుంది.  కాబట్టి నీరు పుష్కలంగా త్రాగాలి.  ఇది రోజును ఉల్లాసంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

చివరగా……

పైన చెప్పుకున్న కారణాలు మీలోనూ ఉన్నాయేమో గమనించుకుని వాటిని సరిదిద్దుకుంటే. మీరూ రోజంతా వెజిల్లాసంగా ఉండవచ్చు. ఎందుకంటే ఆరోగ్యకరమైన జీవితానికి ఆరోగ్యంగా ఉండటం ఎంతో  ముఖ్యం మరి.

Leave a Comment

error: Content is protected !!