వీధి చివర తోపుడు బండి మీద అయినా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా, పండుగలు,శుభకార్యాలు, చిటపట చిరుజల్లులు పడినా ఇలా సందర్భం ఏదైనా మిర్చీలు శనగపిండిలో ముంచి మిర్చీ బజ్జిలు వేయడమో, లేక ఉల్లిపాయ జోడించి పకోడీ వేయడమో లేక జంతికలు, మురుకులు, చేకొడిలు ఒకటేమిటి శనగపిండితో బోలెడు పదార్థాలు అన్ని నోటిని మనసును, కడుపును నిలవనీయవు తినేదాక. అయితే శనగపిండి గూర్చి నిజం తెలుసుకొని తీరాలన్నది ముఖ్యమైన విషయం.
మరి శనగపిండి తయారయ్యే శనగలు గూర్చి కొన్ని నిజాలు చూడండి మరి.
చిర్రి శనగల్లో 25.4గ్రా,, ప్రోటీన్లు, 3.7గ్రా,,కొవ్వు. 47.4గ్రా,కార్బోహైడ్రేట్లు. 11.2గ్రా,, ఫైబర్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల దాదాపు 327 కేలరీలు ఉత్పత్తి చేస్తాయని అంచనా.
శనగలు సగటున 64.17% కేలరీలను కార్బోహైడ్రేట్స్ ద్వారా, 22.32% కేలరీలు ప్రోటీన్స్ ద్వారా, 13.51% కేలరీలు కాల్షియం ద్వారా శరీరానికి అందిస్తాయి.
శనగల్ని లేదా శనగపప్పును వేడి నీళ్లు పోసి నానబెడితే 5-6 గంటల్లో మృదువుగా అవుతాయి. వీటిని వాడుకోవడమే మంచిది.
మొలకెత్తిన శనగలు గూర్చి చెప్పాల్సి వస్తే షుగర్ వ్యాధిని తగ్గించడంలో మొలకెత్తిన శనగల పాత్ర కచ్చితంగా ఉంది అయితే మొలకెత్తిన వీటి కన్నా, మొలకెత్తిన రాగులు, గోధుమలు, సజ్జలు, లాంటివి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. జీర్ణశక్తి ని పెంచుతాయి కానీ వీటి ద్వారా లభించే కేలరీలు చాలా…… తక్కువ.
చాలామంది మాల్ట్ తయారు చేసుకుని వాడుతుంటారు అయితే నేరుగా ధాన్యాలను మరపట్టించి ఆ పిండిని ఉపయోగించి చేసుకునే జావను మాల్ట్ అని పిలవరు. ధాన్యాన్ని నానబెట్టి మొలకలు తెప్పించి ఎండించి మరపట్టించి తయారు చేసిన పిండిని మాల్ట్ గా పిలుస్తారు ఇది ఎంతో గొప్ప పోషకాలను కలిగి ఉంటుంది.
మొలకెత్తిన శనగలు, పెసలు, వేరుశనగలు, బొబ్బర్లు వీటిని రోజువారీ తీసుకోవడం కంటే అపుడపుడు తీసుకోవడం ఉత్తమం.
వండుకునే పదార్థాలకు ఉపయోగించే శనగపిండి మోతాదు ను గూర్చి ఒకసారి ఆలోచిస్తే కందిపప్పు కంటే ఎక్కువగా శనగలు వినియోగిస్తున్నామని అర్థమవుతుంది. నిత్యం మనం వాడే వంటల్లో దాదాపు 48 రకాలు కేవలం శనగపిండిని ఉపయోగించి వాడుతున్నాం. బజ్జిలు, పునుగులు, చక్రాలు, కారప్పూస, బూంది, పకోడా తో మొదలు పెడితే వీటి లిస్ట్ చాంతాడంత ఉంది. చిరుతిళ్లకు శగపిండి లేకుండా ముంకదుకు కదలడం లేదు. ఇంట్లో చేసుకోవడం కంటే బయట తినే ఈ పదార్థాలు మరింత ఆరోగ్యానికి చేటు చేస్తాయి.
చివరగా…..
అపుడపుడు వాడుకుని తింటే ఎలాంటి సమస్య సృష్టించదు కానీ శనగలు వాడకం హద్దు మీరితే ఆరోగ్యం ఇబ్బందులతో పడ్డట్టే అని మర్చిపోకండి