మూత్రనాళంలో తీవ్రమైన మంట, దురద, నొప్పి వంటి సమస్యలు మూత్రనాళ ఇన్ఫెక్షన్కు సూచనలు. ఈ సూచనలు ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. దీనికి ముఖ్య కారణాలు బహుళ లేదా కొత్త భాగస్వాములతో సెక్స్లో పాల్గొనడం, మధుమేహం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం.
మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో అలసత్వం చూపడం అంటే తరచు మూత్ర విసర్జన చేయకపోవడం, అపరిశుభ్ర బాత్రూం ఉపయోగించడం, మూత్ర కాథెటర్ కలిగి ఉండడం, మూత్రం యొక్క ప్రవాహాన్ని నిరోధించడం, మూత్రపిండాల్లో రాళ్లు ఉండడం ఎక్కువగా మూత్రాశయం ఇన్ఫెక్షన్కు కారణం అవుతూ ఉంటాయి. మూత్ర నాళంలో బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు శరీరం యొక్క రక్షణను అధిగమించడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. అవి మూత్రపిండాలు, మూత్రాశయం మరియు వాటి మధ్య నడిచే గొట్టాలను ప్రభావితం చేస్తాయి.
ఇలా మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తరచు మూత్రం వస్తున్నట్లు అనిపించడం, పొత్తికడుపులో నొప్పి , జ్వరం, మూత్రంలో మంట, మూత్రం రంగు మారడం వంటివి ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవడానికి ప్రతి రోజు మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగుతూ తరచూ మూత్ర విసర్జన చేయాలి. ఇలా చేయడం వలన మూత్రాశయం శుభ్రపడి వాటి కండరాలపై ఉండే ఒత్తిడి తగ్గుతుంది. మూత్రాశయంలో పేరుకున్న బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది. దానితోపాటు ఇప్పుడు చెప్పబోయే చిట్కా కూడా చాలా బాగా మూత్రాశయ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.
దానికోసం ధనియాలు తీసుకోవాలి. ధనియాలు శరీరంలో వేడిని తగ్గించి చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ తగ్గించి దానివలన వచ్చే ఇబ్బందిని తొలగిస్తుంది. ఇప్పుడు ఒక రెండు చెంచాల ధనియాలు తీసుకోవాలి. దానిలో ఒక చెంచా పటిక లేదా మిస్రీ పొడి వేసుకోవాలి. ఒక పావు చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసుడు మామూలు నీటిని వేసుకోవాలి. వీటిని బాగా మరిగించి నీటిని వడకట్టుకోవాలి. ఈ నీటిని మూడు భాగాలుగా చేసి రోజులో మూడుసార్లు తాగుతూ ఉండాలి. ఇలా తాగడం వల్ల ఒక్కరోజులోనే మూత్రాశయ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి ఈ కషాయం తాగడం వలన మూత్రనాళ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. మూత్రాశయ ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేయడం వలన స్త్రీలలో ఎక్కువగా నష్టం జరుగుతుంది. మూత్రపిండాలు చెడిపోయే అవకాశం ఉంటుంది.