ప్రస్తుతమున్న కాలంలో చాలామందికి తొందరగా మతిమరుపు వస్తోంది. కారణం ఏమిటని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని మనిషి ఆలోచించడం మానేసి గ్యాడ్జెట్స్ పై ఆధారపడుతున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు పెద్దపెద్ద లెక్కలు, ఇంటి వ్యహారాల లెక్కాచారాలు, కూడికలు, తీసివేతలు వంటివి నోటెడ్ గా చెప్పేవారు. ఇపుడు మాత్రం చిన్న చిన్న కూడికలు, తీసివేత లెక్కలకు కూడా మొబైల్ లేదా సిస్టం, లేదా క్యాలికులేటర్ పైన ఆధారపడుతున్నాడు. ఒకప్పుడు బోలెడు మొబైల్ నంబర్లను గుర్తుపెట్టుకునే మనిషి ఇపుడు నెంబర్ కావాలంటే మొబైల్ లో ఫోన్ బుక్ ఓపెన్ చేస్తున్నాడు. దీనివల్ల మెదడుకు వ్యాయామమనేది లేకుండా క్రమంగా స్పందించడం తగ్గుతోంది.
మెదడు తిరిగి చురుగ్గా అవ్వాలంటే మన జ్ఞాపకశక్తి పెంపొందాలంటే మెదడును పునరుత్తేజం తీసుకొచ్చి దాన్ని తిరిగి దారిలో పెట్టాలి. ఇందుకోసం మనకు గొప్పగా సహకరించే ఆయుర్వేద వరమే బ్రాహ్మీ రసాయనం.
అసలు బ్రాహ్మీ రసాయనం ఎలా పనిచేస్తుంది. ఎంత మొత్తంలో తీసుకోవాలి, అసలు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి. ఇవన్నీ మీకోసమే చూడండి మరి.
◆ ముఖ్యంగా చదువుకునే పిల్లలకు, పరీక్షలు, పోటీ పరీక్షలు రాసేవారికి బ్రాహ్మీ రసాయనాన్ని ఒకటి లేదా రెండు చెంచాలను కొంచం నీళ్లలో కలిపి ఇస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
◆ ఫిట్స్, కొన్ని రకాల మానసిక వ్యాధులు, నరాల జబ్బులు, మెదడు వ్యాధులు, పిచ్చి వంటి వ్యాధులు ఉన్నవారికి బ్రాహ్మీ రసాయనాన్ని వాడితే త్వరగా తగ్గుతాయి. పై చెప్పుకున్న జబ్బులకు మందులు ఎన్ని వాడుతున్న వాటితో పాటు బ్రాహ్మీ రసాయనాన్ని తీసుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది
◆ నత్తి, మాటలు రాకపోవడం, పిల్లలు డల్ గా ఉండటం, వంటి సందర్భాలు ఉంటే ఈ రసాయనం ఇవ్వడం వల్ల ఉత్సాహం పెరిగి చురుగ్గా తయారవుతారు.
బ్రాహ్మీ రసాయనం ఎలా తయారు చేసుకోవాలి.
బ్రాహ్మీ రసాయనం బయట కొనవచ్చు అయితే కాస్త శ్రద్ధ పెడితే ఇంట్లోనే చేసుకోవచ్చు మంచి మన్నికైన రసాయనం తయరవుతుంది కాబట్టి గొప్ప ఫలితాన్ని చూడచ్చు కూడా. మరి బ్రాహ్మీ రసాయనం తయారీ విధానం చూద్దాం.
కావలసిన పదార్థాలు:
- పసుపు కొమ్ములు
- వసకొమ్ములు
- చెంగల్వ కోష్ఠు
- శొంఠి,
- నల్లజీలకర్ర,
- వాము,
- అతి మధురం,
- సైంధవలవణం,
పై చెప్పుకున్న వాటిని సేకరించుకోవాలి ఇవి ఆయుర్వేద దినుసులు అమ్మే షాప్ లలో దొరుకుతాయి. వీటిలో శొంఠి, పిప్పళ్ళు, నల్లజీలకర్ర ను కొద్దిగా ఆవు నెయ్యి వేసి అందులో దోరగా వేయించుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలతో కలిపి మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పొడిని పలుచని వస్త్రంలో వేసి జల్లించుకోవాలి. ( దీనినే వస్త్ర ఘాళితం అంటారు). ఇపుడు అతి మెత్తని పౌడర్ మనకు లభ్యమవుతుంది. ఈ మొత్తం పౌడర్ ఎంత ఉందో దానికి రెట్టింపు నెయ్యి తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో జల్లించుకున్న పొడి వేయాలి. మంచి ఘుబాళింపు వచ్చేవరకు కాంచి తరువాత చల్లార్చి నిల్వచేసుకోవాలి. దీన్ని రోజు రెండు చెంచాల మోతాదులో అన్నంలోకి కలుపుకుని కూడా తినవచ్చు. లేదా నేరుగా తీసుకోవచ్చు కూడా. దీన్ని రోజూ తింటే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా దీన్ని బయట కొనడం కంటే ఇంటిలోనే తయారు చేసుకోవడం ఉత్తమం.
చివరగా….
ప్రస్తుత యంత్రాల మధ్య చదువులో పడి పిల్లల్లో మందగిస్తున్న జ్ఞాపకశక్తిని తిరిగి పెంపొందించుకోడానికి పైన చెప్పుకున్న అద్భుతమైన ఔషదాన్ని పాటిస్తే పిల్లల భవిష్యత్ కు ఎంతో గొప్పగా ఉపయుక్తమవుతుందని వేరే చెప్పాలా.