ఫ్రెండ్స్ మనం తినే ఆహారంలో లో కొన్ని పదార్థాలు కలిపి తినడానికి ఎక్కువగా ఇష్టపడటం చూపిస్తాం. కొన్ని కాంబినేషన్స్ ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ కూడా ఉంది ఇలాంటి ఆహారం తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా కొద్దికాలానికి మన శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ ప్రమాదం కూడా ఉంది. ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాల పదార్థాల కాంబినేషన్ ఇప్పుడు తెలుసుకుందాం
పాలు : పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయి అన్న సంగతి మనకు తెలుసు. కడుపు లోకి వెళ్ళిన ఇలాగే జరుగుతుంది. అందుకే పాలు నిమ్మకాయ కలిపి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్ని రకాల కూరల్లో పాలు కలిగి ఉంటారు. పాలలో ఉప్పు కలిపి వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే పాలతో సాల్ట్ బిస్కెట్స్ తింటుంటారు చాలామంది పాలలోని తీపి పదార్థాలు తప్ప మరే రుచిని కలపకూడదు. అలాగే పాలతో కలిపి చేపలు చికెన్ వంటి మాంసాహారం తినకూడదు. పాలలో పూర్తిగా ప్రొటీన్లు ఉంటాయి అలాగే ఎమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చికెన్ లోనూ ప్రోటీన్ల శాతం అధికంగా ఉంటుంది ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఫుడ్డు మీ ఒకే టైం లో తీసుకోవడం వల్ల హైబీపీ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే పాలతో తో కలిపి చికెన్ కోడిగుడ్డు వంటివి తీసుకోకూడదు. దీని వల్ల మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే అవే ఇవి తీసుకున్న తర్వాత కూడా పాలు తాగినా మీ కడుపులో ఎసిడిటీ ఫామ్ అవుతుంది.
అరటి పండ్లు : అరటి పండ్లు విడివిడిగా వేరువేరు సమయాల్లో తీసుకుంటే చాలా లాభాలు చేకూరుతాయి. కానీ ఈ రెండింటినీ కలిపి ఒకేసారి తీసుకుంటే మన శరీరానికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే పాలు అరటిపండు హెవీ కాంబినేషన్. ఇవి మన శరీరానికి హాని కలిగించే కళ్ళు పెరిగేలా చేస్తాయి. అలాగే మన శరీరం లోకి వెళ్లి స్లో పాయిజన్ గాపోతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఇవి మన మానసిక ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతాయి. అందువల్ల ఈ కాంబినేషన్లో దూరంగా పెట్టాలి పాలతో పాటు ఎలాంటి ఫ్రూట్స్ తినకూడదు. పండ్లు తేలిగ్గా జీర్ణమవుతాయి కానీ పాలు అంత ఈజీగా జీర్ణం కావు కాబట్టి ఈ రెండిటినీ కలపడం వల్ల కడుపులో ఎసిడిటీ సమస్య వస్తుంది అలాగే పాలతో కలిపి సిట్రస్ జాతి పండ్లు అసలు తినకూడదు. సిట్రస్ జాతి పండ్లు అంటే పుల్లగా ఉండే ఫ్రూట్స్ ఉదాహరణకి బత్తాకాయ పైనాపిల్ కమలాపండు లాంటి ఫ్రూట్స్ అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల మన శరీరంలో దగ్గు సైనస్ జలుబు వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఈ కాంబినేషన్ వల్ల మన శరీరం పై అలర్జీలు గజ్జి తామర సోరియాసిస్ కూడా వస్తుంది ఒకవేళ మీరు పాలు తాగిన తర్వాత పండ్లు ఏవైనా తినాలనుకుంటే కనీసం రెండింటికి మధ్య గంట సమయం గ్యాప్ ఉండాలి.
పెరుగు : పెరుగుతో అరటికాయ మాంసం చేపలు టమోటాలు మినప్పప్పు కలుపుకొని అస్సలు కలిపి తినకూడదు. పెరుగుతో పండ్లు ముఖ్యముగా పుల్లగా ఉండే పండ్లు కలిపి అసలు తినకూడదు. దీనివల్ల కడుపులో యాసిడ్స్ ఏర్పడి మన జీర్ణ ప్రక్రియ పై ప్రభావం చూపుతాయి. అలాగే దగ్గు జలుబు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే మినప్పప్పు పెరుగుతో కలిపి ఉండే పదార్థాలు తినకూడదు. దీని వల్ల మన శరీరంలో బ్లడ్ ప్రెజర్ బాగా పెరుగుతుంది. ఎవరికైతే హై బ్లడ్ ప్రెజర్ ఉంటుందో వారు ముఖ్యంగా ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా పెరుగు వడ వంటి పదార్థాలు అసలు తినకూడదు.
మన ఆయుర్వేదం ప్రకారం రాత్రి పడుకోబోయే ముందు పెరుగు అసలు తినకూడదు దీని వల్ల మన జీర్ణ ప్రక్రియ మందగించి మన కడుపులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే పెరుగు తిన్న తర్వాత టీ అసలు తాగకూడదు. ఎందుకంటే ఈ రెండింటిలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి దీని వల్ల మన కడుపులో అసిడిటీ వస్తుంది అలాగే జీర్ణప్రక్రియ దెబ్బతింటుంది.
ఈ ప్రపంచంలో మీరు టీ తర్వాత ఎక్కువగా తాగే పదార్థం బీర్ ఆల్కహాల్ కూల్ డ్రింక్. వీటితో పాటు సాల్ట్ తో ఫ్రై చేసిన పదార్థాలు స్నాక్స్ గా తినడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది దీని వల్ల మన శరీరంలో సోడియం శాతం చాలా పెరిగి పోయి మన శరీరంలో ఉండేసోడియం శాతం పూర్తిగా నాగ పెరిగిపోయి మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీని వల్ల వాంతులు అవ్వడం కళ్లు తిరగడం కొన్ని సందర్భాల్లో ఫుడ్ poison కూడా అవుతుంది. ఇలా తీసుకోవడం వల్ల కొంత కాలానికి మీ పొట్ట బాగా పెరిగిపోతుంది.
తేనే నెయ్యి ఎప్పుడు సమానంగా కలిపి తినకూడదు. దీని వల్ల మన శరీరంలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. తేనెను ఎప్పడూ వేడి పదార్థాలతో కలిపి తినకూడదు. టీ లో తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు కొందరు పాలలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇలా వేడి పదార్థాలలో తేనెను కలిపినప్పుడు తేనెలు కలిసి ఉండే మైనం విషయంగా మారే ప్రమాదం ఉంది. దీనివలన కడుపులో ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది అలాగే కొంత కాలానికి మన జీర్ణక్రియ దెబ్బతింటుంది
చల్లని వేడి పదార్థాలు కలిపి ఒకేసారి తీసుకోకూడదు. పెరుగు కాఫీ ఐస్క్రీం టీ ఇలా రెండూ వెంటవెంటనే తీసుకోకూడదు. భోజనం చేసే సమయంలో చల్లని నీరు తాగకూడదు. ఇలా చేస్తే మన కడుపులో ఉండే ఆసిడ్స్ చల్లారిపోయి మన జీర్ణక్రియ కుంటుపడుతుంది.
చాలామంది సలాడ్స్ లో టమోటా కీరదోస కలిపి తింటూ ఉంటారు. ఈ రెండు కలిపి తినకూడదు ఎందుకంటే ఈ రెండింటికి రెండు విభిన్నమైన గుణాలు కలిగి ఉంటాయి. దీని వల్ల మీ జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. మీ జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. చాలామంది భోజనం చేసిన వెంటనే సలాడ్స్ తింటూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది మీ కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. భోజనం చేసిన తర్వాత రెండు గంటల తర్వాత మాత్రమే సలాడ్స్ తినాలి. అలాగే సలాడ్స్ లో క్యారెట్ వేస్తే అందులో నిమ్మకాయ మాత్రం ఉండకూడదు ఈ రెండు కలిపి తింటే మీ గుండెల్లో మంటగా అనిపిస్తుంది అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. సలాడ్స్ లో ముల్లంగి ఉంటే ముల్లంగి తిన్న తర్వాత పాలు తేనే అరటికాయ అస్సలు తినకూడదు.
వేడిగా ఉండే కాఫీ తాగిన తర్వాత వెంటనే చల్లగా ఉండే నీరు, అలాగే పుల్లగా ఉండే ఫ్రూట్స్ తినకూడదు. దీని వల్ల మీ శరీరంలో జలుబు దగ్గు గొంతు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ముల్లంగి వెల్లుల్లి ఆకుపచ్చని కూరగాయలు ములక్కాయలు తిన్న తర్వాత అసలు పాలు తాగకూడదు. తేనె ముల్లంగి మినుములు మొలకెత్తిన గింజలు ఎలాంటి మాంసాహారంతో కలిపి తినకూడదు. ముఖ్యంగా మినప్పప్పు తో ముల్లంగి పనసపండు కలిపి తినకూడదు. పాలు పెరుగు కీరదోస టమోటా వంటి వాటిలో నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోకూడదు దీనివల్ల మీ కడుపులో ఎసిడిటీని ఎక్కువైపోయి గ్యాస్ సమస్యలు వస్తాయి.
ఇత్తడి లేదా ప్లాస్టిక్ తో తయారు చేసిన పాత్రలు బాటిల్స్ లో పది రోజులకు పైగా నిల్వ ఉంచిన నెయ్యిని అస్సలు తినకూడదు ఎందుకంటే అలాంటి వాటిలో విషపదార్థాలు తయారవుతాయి.
మజ్జిగ అరటిపండు, పెరుగు ఖర్జూరాలు, నల్లమిరియాలు చేపలు, పాలు మద్యం కాంబినేషన్ లో ఆహార పదార్థాలు తినకూడదు.
నువ్వుల పేస్టు పాలకూర కలిపి తయారుచేసిన పదార్థాల్ని తినకూడదు ఎందుకంటే ఆ ఆహారాన్ని తింటే డయేరియా వచ్చే ప్రమాదం ఉంది.
అలాగే పుచ్చకాయలు దాదాపు 95 శాతం వరకు నీరే ఉంటుంది ఇది తిన్న తరువాత నీరు తాగితే శరీరంలోని జీర్ణ రసాల పై దుష్ప్రభావం చూపుతుంది.
మాంసం పాల ఉత్పత్తులు చేపలు వెన్న లేదా మీగడ కలిపి తినకూడదు. పాలు గుడ్లు కలిపి తినకూడదు. పండ్లు ఇతర ఆహార పదార్థాలు కలిపి తినకూడదు ఇలా తినడం వల్ల మన కడుపులో గ్యాస్ పెరుగుతుంది అలాగే అసిడిటీ పెరుగుతుంది.
అందుకే ఖాళీ కడుపుతో తినాలి పండ్లు రెండు గంటల తర్వాత ఇతర పదార్థాలు తినాలి ఒకవేళ వేరే ఆహార పదార్థాలు ముందుగా తింటే రెండు గంటల తర్వాత మాత్రమే పండ్లు తినాలి. ఉడికించిన ఆహారాన్ని ఉడకని ఆహారంతో కలిపి తీసుకుంటే ఆ రెండింటి వల్ల మన జీర్ణక్రియ సరిగ్గా జరగక గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి.