జుట్టు రాలే సమస్య, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు తెగిపోవడం వంటి సమస్యలతో ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో ఆడా మగ ప్రతి ఒక్కరు ఉంటారు. అందమైన పొడవైన జుట్టు ఉన్నవారు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇలాగే కొనసాగితే జుట్టు మొత్తం రాలిపోయి జుట్టు పల్చబడటం ఖాయం.
కానీ వీటిని తగ్గించుకోవడానికి టీ డికాక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. హెన్నాతో కలిపి టీ పౌడర్ డికాక్షన్ వాడుతూ ఉంటాం. ఇది జుట్టును నల్లగా చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ టీ డికాక్షన్ తో అద్భుతమైన చిట్కా ఒకటి తెలుసుకుందాం.
టీ అద్భుతమైన టోనర్. నీరు ఒక అందమైన ముదురు రంగుని పొందే వరకు, మీకు నచ్చిన టీ పౌడర్తో అర లీటరు నీటిని మరిగించండి; నీళ్లు బాగా మరిగి మంచి రంగు వచ్చిన తరువాత స్టవ్ ఆపేసి నీటిని వడకట్టే అండి 1 టీస్పూన్ నిమ్మరసం జోడించండి. షాంపూ మరియు కండిషనింగ్ తర్వాత, ఈ టీ నీటిలో మీరు వాడే ఏదైనా షాంపూను సరిపోయే మొత్తంలో కలపండి.
ఈ మూడు పదార్థాలు బాగా కలిసేలా చేయండి. ఇందులో వాడిన నిమ్మరసం జుట్టు లో ఉన్న జిడ్డుని వదిలించడానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జుట్టు సమస్యలు తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. దీనితో వారానికి ఒకసారైనా మీ జుట్టును శుభ్రం చేసుకోండి. ఈ మిశ్రమం అప్లై చేసిన తర్వాత మామూలు నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్డ్రడీ ఇందులో షాంపూ ఉంది కనుక.
ఇలా కనీసం రెండు నెలలపాటు ఈ మూడింటిని వాడడం వలన జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు. ఈ మిశ్రమం వలన సమస్యలు తగ్గి,జుట్టు బలంగా దృఢంగా పెరుగుతుంది. జుట్టు షైనీగా ఉండడానికి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఈ మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది. కుదుళ్లను బలంగా చేయడానికి బ్లాక్ టీ చాలా మందికి సురక్షితంగా ఉన్నప్పటికీ, సున్నితమైన చర్మం ఉన్నవారు దానిని తలకు అప్లై చేసే ముందు స్కిన్ ప్యాచ్ పరీక్షను ప్రయత్నించాలి.