శరీరంలో ఎక్కడైనా నొప్పులు వస్తుంటే రక రకాల పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం. వీటివలన దీర్ఘకాలంలో అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సహజ చిట్కాలతో ఈ నొప్పులను తగ్గించుకోవడానికి ఇలా చేయడం వలన పైసా ఖర్చు లేకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా నొప్పులను తగ్గించవచ్చు. దాని కోసం మనం చేయవలసిన రెండు పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదట పుదీనా ఆకులను గుప్పెడు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు లో వేసుకోవాలి.
వీటిలో బాగా మరిగిన ఒక గ్లాసుడు నీటిని వేసుకొని దానికి మూతపెట్టి ఒక పావు గంటపాటు వదిలేయాలి. ఇలా చేయడం వలన పుదీనా ఆకులు వేడి నీటిలో ఉడికించి వాటిలోని గుణాలు నీటిలోకి చేరతాయి. ఇలా రంగు మారిన నీటిని తీసుకొని పుదీనా ఆకులను వడకట్టుకోవాలి. తరువాత రాత్రి పడుకునే ముందు ఈ పుదీనా కషాయాన్ని తాగడం వలన ఉదయానికి శరీరంలోని నొప్పులను తగ్గిస్తుంది. పుదీనాలో మెంథాల్ ఉంటుంది, ఇది కండరాలను సడలించడానికి మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
మీ నుదురుపై పుదీనా రసాన్ని పూయడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే, పుదీనా పేస్ట్ లేదా పుదీనా నూనె యొక్క బామ్‌లు తలనొప్పిని నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇలా నొప్పులు తగ్గే వరకు కొన్ని రోజుల పాటు ఈ నీటిని తాగి చూడండి. తక్కువ సమయంలో మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉడికిన పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి.
దీంట్లో ఒక స్పూన్ శొంటి పొడి, ఒక స్పూన్ పంచదార పొడి, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఎక్కడ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్నాయో అక్కడ రాసి దానిపై ఏదైనా క్లాత్తో కట్టు కట్టాలి. ఇలా రాత్రిపూట పెట్టి ఉదయం వరకు ఉంచుకోవాలి ఇలా 1రెండు రోజులు చేయడం వలన నొప్పులు సమస్య తగ్గిపోతుంది ఈ చిట్కాలు ఎన్ని రోజులు వాడాలి అంటే మీకు నొప్పి తగ్గడానికి వాడడం ఆపేయవచ్చు