8 Surprising Health Benefits of Cloves

ఆదివారం రోజు ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది

కొంతమంది ఎంత కష్టపడుతున్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అలాగే ఇంటి సమస్యలు, ఇంట్లో భార్య భర్తల మధ్య సఖ్యత ఉండకపోవడం, గొడవలు, సమాజంలో మంచి స్థానం పొందలేక పోవడం, అనారోగ్యాలతో బాధలు పడడం వంటివి అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. 

దీనికి కారణం మనకు తెలియకుండా మనం చేసిన దోషాలు లేదా గ్రహదోషాలు కావచ్చు. వీటికి పరిహార శాస్త్రంలో నివారణలు ఉంటాయి. వీటిని మంచి కోసం ఉపయోగించినపుడు మనకి మంచి జరుగుతుంది. అలాగే మనం వేరొకరికి చెడు చేయాలని వీటిని ఉపయోగిస్తే మనకి చెడు జరిగే అవకాశం ఉంటుంది.

 మన సమస్యలు తగ్గడానికి ఇప్పుడు ఒక దోష పరిహారాన్ని తెలుసుకుందాం. లవంగాలు మన ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు చాలా బాగా పనిచేస్తాయి. వీటిని రెండు తీసుకోవాలి. ఈ పరిహారం కోసం ఒక గాజు గిన్నె తీసుకోవాలి. దీని కోసం ఎటువంటి స్టీల్, ఇత్తడి లేక రాగి పాత్రలు ఉపయోగించకూడదు. గాజుకు ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది.

 ఇప్పుడు రెండు లవంగాలను ఆడవారు కుడి చేతిలో, మగవారైతే ఎడమచేతిలో పట్టుకొని ఇల్లంతా మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలనికోరుకుంటూ తిప్పండి. అంటే మాకున్న ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ ఇల్లంతా తిరిగి గాజు గిన్నెలో కొద్దిగా నీటిని వేసి ఈ లవంగాలను అందులో వేసుకోవాలి. 

ఈ గిన్నెను రాత్రంతా మన తల దగ్గర పెట్టుకోవడం వలన మనకు వచ్చే పీడకలలు, చెడు స్వప్నాలను కూడా ఈ నీళ్లు ఆకర్షిస్తాయి. తర్వాత రోజు ఉదయం నీటిని పచ్చని మొక్కలకు వేయాలి. ఇందులో మనం ఎటువంటి చెడు శక్తులను ఆవహించలేదు గనుక మొక్కలకు ఏమీ కాదు.

 ఇలా వారం తప్పించి వారం ఆరు వారాల పాటు ఆదివారం పూట చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 12 వారాలు సమయం పడుతుంది. మనకు ఉండే సమస్యలు తొలగి పోవడం ఒక రెండు వారాల తర్వాత మనం గమనించవచ్చు. ఈ పరిహారం వలన మనకున్న అన్ని సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం.

1 thought on “ఆదివారం రోజు ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది”

  1. ఆడవారు కుడి చేతిలో, మగవారు ఎడమ చేతిలో, అని వ్రాసారు, వీడియో లో
    ఆడవారు ఎడమ చేతిలో, మగవారు కుడి చేతిలో అని చెప్పారు ఏది కరెక్టు.

    Reply

Leave a Comment

error: Content is protected !!