ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల వలన అందరికీ జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. దీనిని తగ్గించుకోవడం కోసం రకరకాల ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మార్కెట్లో దొరికే ఆయిల్స్ ఉపయోగించడం వలన అనేక నష్టాలు కలుగుతాయి. వాటిలో కెమికల్స్ ఉండటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనం రెగ్యులర్ గా ఉపయోగించే నూనెలో ఈ ఒక్కటి కలిపి రాసినట్లయితే మీ జుట్టు గడ్డిలాగా పెరుగుతుంది.
ఒక వారం రోజులు ఉపయోగించినట్లయితే తేడా మీరే గమనిస్తారు. దీని కోసం మనం ముందుగా ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ కూడా ఉపయోగించే వాళ్లు అర కప్పు కొబ్బరి నూనె అర కప్పు కాస్టర్ ఆయిల్ ఉపయోగించాలి. కొబ్బరి నూనె వద్దు అనుకున్న వాళ్లు అరకప్పు ఆవనూనె లేదా బాదం నూనె, అరకప్పు ఆముదం తో కలిపి వేసుకోవాలి. ఆముదం వద్దు అనుకున్న వాళ్లు మీరు రెగ్యులర్ గా ఉపయోగించే నూనె ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఒక గిన్నెలో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి.
ఒక క్యారెట్ తీసుకొని పీల్ చేసి మెత్తగా తురుముకోవాలి. ఈ తురుమును కొబ్బరి నూనె వేసి స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి లో ఫ్లేమ్ పెట్టి దగ్గర ఉండి కలుపుతూ దానిలో ఉండే తడి మొత్తం ఇంకా పోయేంతవరకు నూనెను మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె వడకట్టుకోవాలి. ఈ నూనె ఏదైనా గాజుసీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత అలా వదిలేయవచ్చు.
వారంలో రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాలి. దీనిని రెగ్యులర్ గా ఉపయోగించుకోవచ్చు. లేదు డైలీ తలస్నానం చేసే వాళ్ళు రాత్రి అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి. క్యారెట్ తలకు కావలసిన బీటాకెరోటిన్ ను తగిన మోతాదులో అందిస్తుంది. క్యారెట్లో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లు బలంగా చేయడంలో సహాయపడుతుంది. అలాగే స్కాల్ప్ డ్రై గా ఉంటే దాన్ని తగ్గించి చుండ్రును కూడా తగ్గిస్తుంది.
జట్టు ఇన్ఫెక్షన్ లక్షణాలు కలిగి ఉంటే క్యారెట్ ఆంటీబాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ నూనె వరుసగా వారం లేదా పది రోజులు ఉపయోగించినట్లయితే తేడా మీరే గమనిస్తారు. ఊడిన ప్రతి వెంట్రుక తిరిగి వస్తుంది. ఈ నూనె ఉపయోగించడం వలన మంచి ఫలితం ఉంటుంది.