తీపి తినాలంటే.. ప్రతి ఒక్కరు చక్కెరనే వాడుతున్నాము.ఎప్పుడో పండగకి తప్ప దాదాపుగా బెల్లం వాడటం మానేసాం. అయితే ఇక్కడ తెలుసు కావాల్సింది ఏంటంటే.. పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి ఎంతో మేలు. దీనికి చాల కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండాలంటే..బెల్లం తినడం ఎంతో అవసరం.
బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన కండరాల నిర్మాణం, శరీరంలో మెటాబాలిజం క్రమపద్ధతిలో ఉంటుంది. అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతూ… ఒంట్లో ఉండే అధిక నీరు కూడా బయటకు వెళ్ళేలా సహాయం చేస్తుంది.
బెల్లం తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం చేసాక ఒక ముక్క బెల్లం తినడం వలన అసిడిటీ, గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణాన్ని కూడా పెంచుతుంది. ఇలా రక్తాన్ని పరిశుభ్రంగా ఉంచినపుడు ఎన్నో రకాల వ్యాధులు శరీరానికి దరిచేరవు.
- ఈ ఒక్క ఆకుతో మీ పంటిలో ఉన్న పురుగులు మొత్తం బయటకు వస్తాయి
- మందులేని మైగ్రేన్ జబ్బుకు అద్భుతమైన చిట్కాలు
బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. ఆస్తమా ఉన్నవారు బెల్లంలో ఉన్న యాంటి ఎలర్జిక్ తత్వాల కారణంగా, ఇది తింటే మంచి ఫలితాలను పొందుతారు.
బెల్లంతో హల్వా చేసుకొని తినండి.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలానే బెల్లం పరమాన్నం తింటే గొంతు నొప్పులు పోయి మాట హాయిగా వస్తుంది. చలికాలంలో బెల్లంతో చేసిన నువ్వుండల తింటే, ఆస్తమా ఇబ్బందులు ఉండవు.
ఈ బెల్లం, చెవి నొప్పికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నెయ్యితో బెల్లం కలిపి ఒకసారి తిని చూడండి.. చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
బెల్లంలో ఉండే ఇనుము, ఎనిమియా రోగులకు ఎంతో ఉపయోగపడుతుంది.