9 Foods That Act Like Medicine For Common Health Problems

మనం తినే ఆహారమే మన జబ్బులను నయం చేస్తుందని మీకు తెలుసా????

శరీరంలో వాత పిత్త కఫ అనే మూడు గుణాలు ఉంటాయి. ఇవి మూడు హెచ్చు తగ్గులకు లోను కావడం వల్లనే అనారోగ్యం సంభవిస్తూ ఉంటుంది. అయితే మనం తినే ఆహారం వల్లనే ఈ మూడు గుణాలు ప్రభవితం అవుతాయి. చిత్రంగా పెద్దలు చెప్పె విషయం మనం తినే ఆహారం వల్ల సంభవించే అనారోగ్యాలను ఆహారంతోనే చెక్ పెట్టవచ్చునని. కానీ చాలామందికి ఎలాంటి సమస్య వచ్చినపుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే సమస్య తగ్గుతుందనేది తెలియదు. అలాంటి గొప్ప ఆరోగ్య చిట్కాలు మీకోసం.

◆జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడి బాధపడేవారు, మాంసకృత్తులు, మసాలా దినులులు, కారం, పులుపు మొదలైనవి తీసుకోవడం మానేయాలి.  తేలికగా ఉన్న పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల జీర్ణాశయానికి ఎక్కువ ఇబ్బంది లేకుండా జీర్ణాశయం పటిష్టమయ్యేందుకు అవకాశం దొరుకుతుంది.

◆అతిమూత్ర వ్యాధి కలవారు తీపి , చక్కెర, బంగాళాదుంపలు, తియ్యని పండ్లు, ధాన్యములు తీసుకోకూడదు. పీచు అధికంగా ఉన్నవాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

◆చింతాకును బాగా నూరి వేడిచేసి శుభ్రమైన గుడ్డలో చుట్టి నొప్పులున్న చోట కట్టుకడితే నొప్పులు తగ్గుతాయి.

◆గర్భిణీ స్త్రీలు మంచినీరు బాగా తీసుకోవాలి. దంపుడు బియ్యం, ద్రాక్ష, చిక్కుళ్ళు, ఖర్జూర, మొదలైన పండ్లు తినాలి. టీ, కాఫీ, పొట్టు తీసిన ధాన్యం, పిండివంటలు అధికంగా నూనెలు, తీపి వాడినవి తీసుకోకూడదు.

◆చింతపండు పులుసు వంటల్లో వాడితే మలబద్దకం తగ్గుతుంది.

◆క్యాబేజీ, మామిడి బాగా తీసుకునేవారికి కాన్సర్ దూరంగా ఉంటుంది. 

◆ద్రాక్ష, రాస్ బెర్రి మొదలగు పండ్ల రసాలు శరీరంలో మలినాలు మరియు విషక్రిములను నశింపజేస్తాయి.

◆పసుపు యొక్క రసాన్ని గాయములు, జలగ కరిచిన చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

◆నెలసరి సమయంలో అధికంగా ఋతురక్తం పోతుంటే స్నానం చేసిన తరువాత పసుపును కుంకుడు గింజంత ఉండగా చేసి మింగితే సమస్య పరిష్కారం అవుతుంది.

◆దోసకాయను చక్రాల్లా తరిగి నిమ్మరసంలో ముంచి ఆ దోస చక్రంతో మొహం మీద రుద్దుకోవాలి ఇలా చేస్తే మచ్చలు పోయి అందంగా ఉంటుంది.

◆రాత్రిపూట పడుకునేముందు గ్లాసుడు నీటిలో రెండు చెంచాల తేనె కలిపి తాగితే మంచి నిద్ర పట్టడం మాత్రమే కాకుండా జీర్ణకోశ వ్యాధులు నివారణ అవుతాయి మరియు ఉబ్బసం తగ్గుతుంది.

◆బొగ్గు పొడిలో తేనె కలిపి పళ్ళు తోమితే పళ్ళు తెల్లగా మారతాయి. అన్ని రకాల పంటి సమస్యలు తగ్గిపోతాయి.

◆నత్తి ఉన్న పిల్లలకు రోజూ తేనె నాలుక మీద రాస్తుంటే నత్తి తగ్గి మాట స్పష్టంగా వసుంది.

◆తేనె, అల్లం రసం, వెల్లుల్లి రసం, మూడు బాగా కలిపి అర ఔన్స్ చెప్పున సేవిస్తే రొమ్ము నొప్పి తగ్గుతుంది.

◆బాగా పండిన మేడి పండును బెల్లంతో కానీ, తేనె తో కానీ, భుజిస్తే ముక్కు నుండి కారే రక్తస్రావం అరికడుతుంది.

చివరగా……

ఆరోగ్యం కోసం బోలెడు చిట్కాలు అవగాహనతో పాటిస్తే అద్భుతమైన జీవితం సొంతమవకుండా ఆపడం ఎవరి వల్లా కాదు. కాబట్టి తప్పకుండా పైన చిట్కాలను సమస్య ఉన్నపుడు ఆచరించండి.

Leave a Comment

error: Content is protected !!