చాలా మంది సన్ టాన్ వలన చర్మం రంగు మారిపోయి మళ్ళీ మునుపటిలా తెల్లగా అవ్వడం కోసం రకరకాల క్రీమ్స్ ఉపయోగిస్తారు. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. పార్లర్కీ వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టినప్పటికీ పెద్దగా తేడా ఉండదు. జపనీస్ స్కిన్ వైట్నింగ్ సీక్రెట్ తెలిసినట్లయితే మీరు కూడా తెల్లటి చర్మం పొందవచ్చు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని కోసం మనం ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ తో బియ్యం తీసుకోవాలి.
ఒక బౌల్ తీసుకుని బియ్యం దాంట్లో వేసి ఒక మీడియం సైజు బంగాళదుంప పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో ఒక గ్లాసు నీళ్ళు వేసి బియ్యం మరియు బంగాళదుంప మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తరువాత వైట్ గా ఉండే ఏదైనా బాత్ సోప్ ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఉడుకుతున్న బియ్యం మరియు బంగాళదుంపలో వేసి కరిగేంతవరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. సబ్బు కరిగి పోయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి దీనిని కొంచెం చల్లార్చుకోవాలి.
తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ క్రీం ఏదైనా గాజు సీసాలో పెట్టి వారం నుంచి పది రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ క్రీమ్‌ని రోజు స్నానం చేసేటప్పుడు బాత్రూంలోకి ఒక బౌల్లో తీసుకొని వెళ్లి బాడీ మొత్తం మరియు ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేసినట్లైతే ముఖం తెల్లగా మెరిసిపోతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు వలన వచ్చిన మచ్చలు, సన్ టాన్ , డార్క్ స్పాట్స్ మొత్తం పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.
ఈ క్రీమ్ ను ఐదు సంవత్సరాల పిల్లల నుండి అందరూ ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మేము తెల్లగా లేము ఏమి చేసినా సరే తెల్లగా అవ్వట్లేదు అనుకునేవారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది. రకరకాల క్రీములు, పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకొని విసిగి పోయినవారు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.