About annona reticulata Ramaphalam uses in telugu

అరుదైన ఈ పండు ఎక్కడైనా దొరికితే అసలు వదలకండి

రామాఫలం  గూర్చి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే ఇది చాలా అరుదుగా లభించే ఫలం. అయితే ఈ ఫలం తినడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో   కార్బోహైడ్రేట్లు,  డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రోటీన్  విటమిన్ బి1,  విటమిన్ బి2, బి3, బి5, బి6, విటమిన్ సి, కాల్షియం 30, ఐరన్, భాస్వరం, పొటాషియం, సోడియం వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇన్ని పోషకాలు నింపుకున్న రామాఫలం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గూర్చి తప్పక తెలుసుకోవాల్సిందే. 

మధుమేహాన్ని తగ్గిస్తుంది. 

  ఇతర రకాల పండ్ల కన్నా తక్కువ తీపిగా ఉంటుంది.  అంటే ఈ పండులో ఇతర పండ్ల కంటే తక్కువ మోతాదులో చక్కెర ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండే మధుమేహం ఉన్నవారు ఈ పండును తీసుకోవడం వల్ల వారికి చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయం ఉండదు. అంతేకాదు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించడం ద్వారా మధుమేహం ను తగ్గిస్తుంది.  

మొటిమల చికిత్స

 విటమిన్లు, ముఖ్యంగా బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి తో నిండిన ఈ పండు మొటిమలకు ఉత్తమ నివారణ.  శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపడంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. అలాగే ఈ పండులో లభించే కొవ్వు పదార్థాలు శరీరానికి అవసరమైనవి అవ్వడం వల్ల  చర్మానికి  ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటు, చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. 

చుండ్రు చికిత్స

కాస్త  జిడ్డు స్వభావం గల రామాఫలం పండును తినడం మాత్రమే కాదు తలకు హెయిర్ పాక్ లా పెట్టుకుక్వడ్సమ్ వల్ల చుండ్రు తొందరగా తగ్గిపోతుంది. మరియు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహాధం చేస్తుంది. , 

ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్

 పొటాషియం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్‌కు మంచి ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది కండరాల పెరుగుదలను  ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మరియు మలబద్దకాన్ని తగ్గించి విసర్జన ప్రక్రియను సమర్థవంతంగా ఉంచుతుంది. 

నొప్పులు తగ్గిస్తుంది

 యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.  మరోవైపు న్యూరాన్ వ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచడానికి మరియు దోహదపడుతుంది. 

బ్యాక్టీరియాతో పోరాడుతుంది

 సహజ యాంటీబయాటిక్, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ అయిన ఈ పండు విరేచనాలు, న్యుమోనియా మరియు టైఫాయిడ్లకు ఔషధంగా ఉపయోగించవచ్చు. పై సమస్యలు ఉన్నవారు రామాఫలం తీసుకోవడం వల్ల తొందరగా కోలుకుంటారు. 

 హైపర్ పిగ్మెంటేషన్ చికిత్స

 హైపర్ పిగ్మెంటేషన్ శరీరంలో చర్మం కొన్ని భాగాలలో నలుపెక్కి ఇబ్బంది పెట్టే సమస్య దీనికి  రామాఫలం ఉత్తమంగా పనిచేస్తుంది. చర్మం మీద పేరుకున్న నలుపును మరియు ఆయిల్ ను ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది. 

ఎముకలు బలోపేతం చేస్తుంది

 ఈ పండులో  కాల్షియం మరియు విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయి. కాల్షియం ఎముకల బలాన్జకి కచ్చితంగా అవసరమైనది. ఇది ఈ పండులో పుష్కలంగా ఉంటుంది. ఎముకలు పెళుసు బారడం, కీళ్ల సమస్యలు మొదలైన వాటికి ఈ పండు అద్భుతంగా పనిచేస్తుంది.  

జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా ఉంచుతుంది.

ఇందులోని  ఫైబర్  జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.   ఇది  ప్రేగులను శుభ్రం చేస్తుంది మరియు జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాడుతుంది.  

చివరగా 

ఈ పండును తినడం వల్ల పైన చేపలుకున్న ఆరోగ్యప్రయోజనాలు మాత్రమే కాకుండా దురద మరియు చెమట తగ్గించడం, చర్మాన్ని రక్షించడం,  తలలో పేను కోరుకుడు, తామర, యాంటీ ఏజింగ్ వంటి ఎన్నో సమస్యలకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. అరుదైన ఈ ఫలం ఎక్కడైన దొరికితే మాత్రం వదలకండి.

Leave a Comment

error: Content is protected !!