మన శరీరం ఒక యంత్రం లాంటిది. అస్థిపంజరానికి కండరాలు, కండరాల మీద చర్మం ఇలా తయారైన మన శరీరంలో కండర వ్యవస్థ చాలా ముఖ్యమైనది. మనిషి శరీరాన్ని దృడంగా ఉంచేవి ఆరోగ్యకరమైన కండరాలే. అయితే ప్రస్తుతం చాలా మంది కండరాల బలహీనతతో భాధపడుతున్నారు. కండరాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని అనుకుంటే ప్రోటీన్ల అవసరం చాలా ఉంటుంది. శరీర కండరాలను పటిష్టం చేయడంలో ప్రోటీన్ల పాత్ర అద్వితీయం. ప్రోటీన్లు తీసుకుంటూ సరైన వ్యాయామం చేస్తుంటే శరీరం దృడంగా ఉంటుంది. అయితే ప్రోటీన్లు సమృద్ధిగా దొరికే కొన్ని ఆహారపదార్థాలు ఏమిటో చూద్దాం.
గుడ్లు
గుడ్లు ప్రోటీన్లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కంటి ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు మరియు మెదడుకు అవసరమయ్యే పోషకాలు గుడ్డులో లభిస్తాయి.
బాదం
ఫైబర్స్ విటమిన్ ఇ, మాంగనీస్ మరియు మెగ్నీషియంతో సహా ముఖ్యమైన పోషకాలు బాదంలో లభిస్తాయి. బాదం గొప్ప ప్రోటీన్ సమ్మేళనంగా పేర్కొనవచ్చు.
చికెన్ బ్రెస్ట్
చికెన్ బ్రెస్ట్ ప్రోటీన్ అధికంగా గల ఆహారాలలో ఒకటి. చర్మం లేకుండా ఉన్న దాంట్లో ఎక్కువ కేలరీలు ప్రోటీన్ల నుండే లభిస్తాయి.
ఓట్స్
ఆరోగ్యకరమైన ధాన్యాల్లో ఓట్స్ కూడా ఒకటి. ఇందులో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మెగ్నీషియం, మాంగనీస్, థియమిన్ మరియు అనేకరకాల పోషకాలు ఉంటాయి.
చీజ్
ప్రోటీన్లు అధికంగా దొరికే ఆహార పదార్థాలలో చీజ్ కూడా ఒకటి. కళ్ళు మరియు ఎముకలకు రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది కూడా.
కాటేజ్ చీజ్
ఇందులో అధిక నాణ్యత గల ప్రోటీన్లు ఉంటాయి. మన దేశంలో కాటేజ్ చీజ్ ను పన్నీర్ గా పిలుస్తారు.
పెరుగు
ఇందులో ప్రోటీన్లు మాత్రమే కాకుండా కాల్షియం, విటమిన్ బి12 కూడా లభిస్తుంది. కాల్షియం ఒక నిర్దిష్టమైన ఖనిజం. దీనిని శరీరం సొంతంగా తయారుచేసుకోలేదు మరియు లభ్యం కాదు కూడా. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి.
సోయాపాలు
శాఖాహారులు కొన్ని రకాల పదార్థాలు తినరు. అయితే పోషకాహార లోపం రాకుండా వుండటానికి కావాల్సిన ప్రోటీన్లను ప్రత్యామ్నాయ పదార్థాల ద్వారా భర్తీ చేసుకోవాలి. అలాంటి వాటిలో సోయాపాలు ఉత్తమమైనవి.
చేపలు
సముద్ర ఉత్పత్తులు అయిన చేపలు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో ఉత్తమంగా సహాయపడతాయి. చేపలను తరచుగా తీసుకుంటూ ఉండాలి.
పిస్తా పప్పు
ప్రోటీన్ యొక్క అధిక వనరుగా పిస్తా పప్పును పేర్కొనవచ్చు. ఫైబర్ ను సమృద్ధిగా కలిగి ఉంటుంది అందువల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. మరియు ఆకలిని తగ్గిస్తుంది కాబట్టి ఊబకాయం ఉన్నవారు పిస్తా పప్పును తీసుకోవచ్చు.
వాల్ నట్స్
వాల్ నట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. ఇందులో కాపర్ ఎక్కువగా ఉంటుంది.
గుమ్మడికాయ విత్తనాలు
గుమ్మడి విత్తనాల్లో ప్రోటీన్ తో పాటు జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి శరీర రోగనిరోధకశక్తి పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పురుషుల్లో ప్రోస్టేట్ కాన్సర్ ను నివారిస్తుంది.
చివరగా……
శరీరం దృడంగా ఉండాలంటే సమృద్ధిగా ప్రోటీన్లు అవసరం. పైన చెప్పుకున్న ప్రోటీన్ వనరులను ఆశ్రయించడం ద్వారా మనం అనుకున్న ఫలితాన్ని పొందవచ్చు.
Good *