టీకా చేయడానికి ముందు లేదా తరువాత మీరు చేయకూడని 6 విషయాలు గురించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాన్ని అనుసరించి తెలుసుకుందాం.
కోవిడ్ -19 కు వ్యతిరేకంగా దేశంలో కొనసాగుతున్న టీకా డ్రైవ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన అనేక మార్పులతో, ఆన్‌లైన్‌లో టీకా నియామకాలను వ్యాక్సిన్ వేసుకునే వ్యక్తులకు ఎటువంటి గందరగోళం ఉండకుండా ఉండటానికి కొన్ని చేయవలసినవి మరియు చేయకూడని వాటిని పేర్కొనే మార్గదర్శకాన్ని కేంద్రం విడుదల చేసింది.
ప్రస్తుతం, టీకా డ్రైవ్‌లో భారతదేశం మూడవ దశలో ఉంది, ఇక్కడ 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు కూడా టీకా పొందటానికి అర్హులు, అయితే 45+ మందికి టీకాలు వేయడానికి కోవిడ్ -19 గా ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. వృద్ధులకు మరింత ముఖ్యంగా వేయించుకోవాలి.
వాక్సిన్లు వేయించుకున్నవారు చేయకూడని 6 విషయాలు ఇక్కడ ఉన్నాయి:
> టీకా వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పారాసిటమాల్ కాకుండా ఏ ఇతర మందులు డాక్టర్ సలహ లేకుండా వేసుకోకూడదు.
> టీకా చేసిన రోజునుండి, మద్యం లేదా మరే ఇతర మత్తుపదార్థాలను తీసుకోకూడదు.
> ఏదైనా టీకా దుష్ప్రభావం వస్తే పారాసిటమాల్ వేసుకోవాలి. ఈ విషయంలో భయపడకూడదు.
> రెండవ మోతాదు కోసం నమోదు అవసరం లేదు.
> టీకా వేసుకున్న తర్వాత ఎటువంటి పథ్యం చేయనవసరంలేదు. జ్వరం లేకపోతే నాన్వెజ్తో సహా అన్ని తినవచ్చు
>జ్వరం తలనొప్పి లాంటి దుష్పభవాలు వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకోవాలి. అప్పటికీ తగ్గకుండా తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి
>కోవిడ్ వాక్సిన్లు వేయించుకున్న తర్వాత ఇతర ఏ వాక్సిన్లు వేయించుకోకూడదు.
వాక్సిన్ కోవీషీల్డ్, కోవాక్సిన్ ఏవైనా శరీరంలో డెబ్బై శాతం రక్షణ అందిస్తాయి. మిగతా ముఫ్పైశాతం రక్షణకోసం మనం కోవిడ్ నియమాలను తప్పక పాటించాలి. అలాగే బయట వినిపిస్తున్న గాసిప్స్ నమ్మి వాక్సిన్ వేయించుకోకుండా ఉండకూడదు.
డయాబెటిస్, గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పక వాక్సిన్ వేయించుకోవాలి. వారం తర్వాత శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. ఇవి వైరస్ మనుగడను కష్టతరం చేసేందుకు కావలసిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే ఇప్పటివరకు వాక్సిన్ వేయించుకోనివారు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంటే తప్పక నమోదు చేసుకోండి.