ప్రపంచమంతా కరోనా మహమ్మారి వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీని నుండి మనల్ని మనం రక్షించుకోవడం కోసం జాగ్రత్తలతో పాటు, వ్యాక్సిన్ కూడా చాలా అవసరం. కరోనాతో పోరాడడానికి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి వ్యాక్సిన్ చాలా అవసరం. వాక్సిన్ చేయించుకున్న తర్వాత శరీరానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కారణం ఇంజక్షన్లోని ఔషధ లక్షణాలు. ఇంజక్షన్ మన శరీరంలో వైరస్ తో పోరాడటానికి ప్రతిబంధకాలు తయారు చేస్తుంది అని మన అందరికి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత వచ్చే కొన్ని లక్షణాలు రెండు మూడు రోజుల్లో వాటికవే తగ్గిపోతాయి.
వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొంతమందికి శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. ఈ జ్వరం రెండు,మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కరోనా వాక్సిన్ చేయించుకున్న తర్వాత కనిపిస్తున్న రెండవ లక్షణం శరీరం అలిసిపోయినట్లు నీరసంగా ఉండటం. ఈ లక్షణం వలన వాక్సిన్ మీ శరీరంలో బాగా పనిచేస్తుంది అనడానికి సూచన. ఇది కూడా రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే శరీరానికి తగినంత విశ్రాంతి కల్పించాలి మరియు ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి.
పౌష్టిక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వ్యాక్సిన్ వల్ల వచ్చే మరో సైడ్ ఎఫెక్ట్స్ తలనొప్పి. వ్యాక్సిన్ మన శరీరం లోకి వెళ్ళి ప్రతిబంధకాలు తయారు చేసే క్రమంలో తలనొప్పి కూడా వస్తుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఇది కూడా సాధారణ లక్షణం. ఇది కూడా రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. కొంతమందిలో ఈ లక్షణంతో పాటు వికారం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒకటి లేదా రెండు రోజుల్లో తప్పకుండా తగ్గిపోతాయి. ఈ వ్యాక్సిన్ చేయించుకున్నప్పుడు కొంతమందిలో చేతులు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి.
ఇవన్నీ సాధారణ లక్షణాలు. కొంతమందికి కాళ్లల్లో తిమ్మిర్లు వస్తాయి. కానీ ఈ లక్షణాలు 50 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా టీకా వేసిన భాగంలో ఎరుపు లేదా వాపు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది కొంచెం ఇబ్బంది కలిగించిన రెండు,మూడు రోజుల్లో వాపు, నొప్పి తగ్గిపోతుంది. వాక్సిన్ చేసిన చేతిని కదుపుతూ ఉంటే నొప్పి త్వరగా తగ్గుతుంది. ఇలా రెండు,మూడు రోజుల్లో తగ్గకుండా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటే, రోజువారీ దినచర్య ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఒకసారి డాక్టర్ను కలవడం మంచిది. డాక్టర్లు ఏవైనా మందులు ఇవ్వవచ్చు.
మీరు సొంతంగా ఎటువంటి మందులు వాడకూడదు.
ఇంజక్షన్ చేసిన చోట వాచితే అక్కడ శుభ్రమైన చల్లని నీరు లేదా వేడి నీటితో కాపడం పెట్టండి. ఈ సమస్యలన్నీ వీలైనంత వరకు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవడం మంచిది. అలాగే ప్రతి ఒక్కరు వాక్సిన్ చేయించుకోవడం కూడా తప్పనిసరి. వ్యాక్సిన్ మన ఒక్కరి కోసమే కాదు మన చుట్టుపక్కలవారు.మన కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం కూడా.
After taking vaccine for 12 days pains fever coming
నేను కోవెక్సిన్ 14.4.21 న 1st. డోస్ వెయుంచుకున్నాను.వైజాగ్,విసలాక్షిణగర్,బీవీక్ కాలేజ్ లో. నాకు ఏమి అనిపించలేదు. అంటే పనిచేయలేదని అర్ధం కాదు కదా. 2nd. డోస్ 84 రోజుల తరువాత అన్నారు. మాకు ఏమైనా తెలియపర్చుతారా.