akshmi devi lakshmi ashtakam lakshmi ashtakam in telugu

ఇరుగుపొరుగు నుండి ఈ వస్తువులు తీసుకుంటే దరిద్రం. మీకు కష్టాలు తప్పవు

చాలావరకు ఇంట్లో ఏదైనా వస్తువు నిండుకున్నప్పుడు లేదా బయటకు వెళ్లి తెచ్చుకోలేని సమయంలో పక్కింటి వారిని అడిగి కొన్ని వస్తువులు తీసుకుంటాం. అయితే ఇలా ప్రతి వస్తువు తీసుకోవడం మంచిది కాదు. ఇలా పక్కింటి వారిని అడగకూడని వస్తువులు ఏంటి. అలా అడగడం వలన మనకు జరిగే నష్టం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు పట్టణాల్లో ఈ పద్ధతులు చాలావరకు తగ్గిపోయాయి కానీ ఒకప్పుడు పల్లెటూళ్లలో చాలా వరకు కొన్ని వస్తువులను వేరే వారి దగ్గర నుంచి తీసుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు.

 ఎందుకంటే కొన్ని వస్తువుల పై శని దేవుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వస్తువులను మనం వేరే వారి నుండి తీసుకోవడం వలన శని యొక్క ప్రభావం మనపై పడుతుంది. అలాంటి వస్తువులలో ముఖ్యంగా నూనెలు తీసుకోకూడదు. ఒకప్పుడు నువ్వుల నూనె మాత్రమే తీసుకోకూడదు అని చెప్పేవారు కానీ ఇప్పుడు చాలామంది ఏ నూనె అయినా సరే వేరే వారి నుండి తీసుకోవడం మానేశారు.

 అలాగే ఉప్పు, నువ్వులు, బెల్లం, నెయ్యి, ఇనుము వస్తువులు అసలు వేరే వారి నుండి అప్పుగా తీసుకోకూడదు. అలాగే ఎప్పుడు నేరుగా చేతినుండి చేతికి తీసుకోకూడదు. నువ్వులతో చేసిన పదార్థాలు కూడా ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవలసి వస్తే ఎదుటివారికి రూపాయి, రెండు రూపాయలు అయినా ఇచ్చి మాత్రమే తీసుకోవాలి. అలాగే చీపురు, చేట, చెప్పులు కూడా వేరే వారి నుండి తీసుకోకూడదు. అలాగే నల్లని, నీలం దుస్తులు కూడా ఎప్పుడు ఒకరి నుండి తీసుకోకూడదు. ఇవి శని దేవునికి ఇష్టమైన రంగులు కనుక వీటిని వేరే వారి నుండి అప్పుగా లేదా దానంగా తీసుకోవడం వలన ఆ ప్రభావం మనపై వస్తుందని నమ్ముతారు.

 అలాగే పాల కోసం తోడు అడిగి తీసుకుంటూ ఉంటాం. కానీ అలా తీసుకోకూడదని చెబుతున్నారు. ఎప్పుడైనా పాలకోసం తోడు అవసరమైనా మజ్జిగ కోసం అని చెప్పి తెచ్చుకోవాలి. అంతేకానీ పాలలోకి తోడు వేయడానికి అని చెప్పి తీసుకోకూడదు. అలాగే పాత బట్టలు కూడా వేరే వారి నుండి ఎప్పుడు తీసుకోకూడదు. అలా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలతో పాటు శని ప్రభావం కూడా వస్తుంది. పాత బట్టలు కేవలం ఒకే ఒక సమయంలో మాత్రం తీసుకోవచ్చు. బిడ్డకు జన్మనిచ్చినప్పుడు బిడ్డ కోసం పాత బట్టలు తీసుకుంటారు. అది కూడా పిల్లలు ఉన్న పెద్దవారి నుండి తీసుకోవడం వల్ల బిడ్డకు మంచి జరుగుతుందని నమ్ముతారు. 

అలాగే పాత బట్టలు తీసుకోవడం వల్ల వారి శని ప్రభావం మనపై పడితే శని దేవుని యొక్క గమనం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందువలన శని ప్రభావం మనపై పడితే మన పైనుండి తొలగడానికి అంతే ఆలస్యం అవుతుంది. కనుక వీలైనంత వరకు వేరే వారి నుండి ఎటువంటి వస్తువులు తీసుకోకూడదు అని చెబుతారు. వీటన్నింటి వలన మనకు దరిద్రం పడుతుందని అంటారు. దరిద్రం అంటే మనం ఎంత శ్రమపడినా దానికి తగిన ఫలితం మనకు దొరకకపోవడం. అందుకే ఇకపై వేరే వారి నుండి ఏదైనా వస్తువులు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే తీసుకోండి.

Leave a Comment

error: Content is protected !!