యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న కలబంద గొప్పతనాలు మన భారతీయులకు తెలియక పోవడం అత్యంత బాధాకరం. ఎక్కడో పాశ్చాత్త దేశాలలో పుట్టిన శాస్త్రజ్ఞులు మన దేశానికి వచ్చి మన ఆయుర్వేద గ్రంధాలు చదివి ఎక్కడ పడితే అక్కడ దొరికే కలబందను తీసుకుపోయి, వాళ్ళ దేశాలలో లక్షలహెక్టార్లలో పెంచి, దాన్నుంచి ఔషధాలను తయారు చేసి వాటిని మన దేశంలోనే వేలరూపయలకు అమ్ముకుంటున్నారు. దీనికి మన ప్రభుత్వాల అంగీకారం, మన పిచ్చితనం రెండూ తోడ్పడుతున్నాయి.
దీని ప్రయోజనాలను ఎన్నో .. అయితే ఇప్పుడు కొన్నైనా తెలుసుకుందాం…
కంటినొప్పికి కలబంద – కలబంద కోయగా వచ్చే సొనను ఒక గుడ్డలోవేసి, మూడునాలుగు చుక్కలు రెండు చెవులలో పోస్తే .. ఆశ్చర్యకరంగా కంటినొప్పి తగ్గిపోతుంది.
ఎక్కిళ్ళును వెంటనే తగ్గించుటకు కలబంద – ఒక 30గ్రా. కలబంద రసంలో మూడు చిటికెలు శొంటి పొడి కలిపిన మిశ్రమాన్ని సేవిస్తే తక్షణమే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
కుక్క కాటుకి కలబంద- కలబందమట్టను మధ్యలోకి చీల్చి ఆ గుజ్జుపైన సైంధవలవణం పొడి చల్లి కుక్క కరిచిన ప్రదేశంలో దానిని వేసి కట్టుకట్టాలి. రోజుకి ఒకసారి కట్టుమారుస్తూ వుండాలి. ఇలా కనీసం నాలుగైదు సార్లు చేస్తే కుక్క కరిచిన ప్రభావం, దాని విషం హరించిపోతుంది.
- దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు
- రాత్రి పూట ఇలా చేస్తే వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది
బహిష్టులో వచ్చే కడుపునొప్పికి కలబంద – ఒక చంచా కలబంద గుజ్జు, ఒక చంచా నెయ్యి, కరక్కాయల పొడి మూడు చిటికెలు, సైంధవలవణం కూడా మూడు చిటికెలు వేసి, మిశ్రమంలా చేసుకొని రోజూ రెండు పూటలా ఆహారానికి ఒక గంటముందు తింటూ ఉండాలి.. ఇలా చేస్తే, స్త్రీలకు బహిష్టులో వచ్చే కడుపు నొప్పి తప్పక తగ్గుతుంది.
కీళ్ళనొప్పులకు కలబంద హల్వా- కలబంద గుజ్జు, ఒక కేజీ తీసుకోండి.. ఇందులో అరకేజీ గోధుమపిండి, అరకేజీ ఆవునెయ్యి, రెండున్నర కేజీల పటికబెల్లం పొడి, తీసుకోవాలి. ముందుగా కలబంద గుజ్జుని, నెయ్యిలో వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అలాగే గోధుమపిండిని కూడా ఆవు నేతిలో కొంచం ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి. ఆ తరువాత పటికబెల్లాన్నిచిన్నమంటపైన మరిగిస్తూ పాకం పట్టాలి.. పాకంరాగానే కలబంద గుజ్జును, గోధుమపిండిని ఆవునేతిని అందులో కలిపితే హల్వా తయారవుతుంది. ఈ హల్వాను రోజూ రెండుపూటలా ఒక చంచా చప్పున తింటుంటే.. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
సంస్కృతంలో ‘కుమారి’ అని పిలువబడే ఈ కలబందని మన కుమార్తె అనుకొని ఇకనైన కాపాడుకుందామా?
Fistula treatment explain