Amazing Benefits of Drinking Barley Water

ఈ నీటిని ఇలా తీసుకుంటే ఆశ్చర్యపరిచే పలితాలు మీ సొంతం!!

అసలే వేసవి కాలం. వేసవి వేడితో హోరెత్తి పోతున్నాం.  ఏసీల్లో ఉన్న కూల్ డ్రింక్ తాగినా 

ఆ చల్లదనం మన శరీరానికి కాసేపే మాత్రమే.

శరీరంలో ఉన్న లోపల వేడిని తగ్గించకుండా పైపైన కాసేపు చల్లగా ఉన్నంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు. మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే బార్లీ గింజల పానీయం గురించి ఇప్పుడు తెలుసు కుందాం. బార్లీ గింజల ప్రయోజనాలు ఏమిటో అవి మన ఆరోగ్యానికి ఎలా మంచి చేస్తాయో బార్లీ గింజలు ఎలా ఏ టైంలో తీసుకుంటే ఫలితం ఉంటుందో అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

◆ఏ కాలంలో నైనా సరే మనం ఉదయాన్నే బార్లీ నీరు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

◆అధిక బరువుతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించే బార్లీ జావ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక లీటరున్నర నీటిలో ఒక కప్పు బార్లీ గింజలు వేసి 20  నిమిషాల సేపు బాగా మరిగించాలి. అలా మరిగిన తర్వాత పక్కన పెట్టి చల్లారిన తర్వాత రుచి కోసం చిటికెడు ఉప్పు కొంచెం నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. లేదా రెండు స్పూన్ల తేనె అయినా కలుపుకుని తాగవచ్చు.

◆అలా కాచిన నీటిని సాయంత్రం వరకు కొంచెం కొంచం గా తాగుతూ ఉండొచ్చు. తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మార్కెట్లో బార్లీ పౌడర్ కూడా దొరుకుతుంది అది కూడా వాడుకోవచ్చు.

◆బార్లీలో బీటా గ్లూకోన్ అనే పదార్థం శరీరంలో ఉండే హానికరమైన విష పదార్థాలను వ్యర్థాలను విసర్జన క్రియ ద్వారా బయటకు పంపిస్తుంది. ప్రేగుల్ని శుభ్రపరచడం తో పాటు పెద్ద ప్రేగు లో వచ్చే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది

◆బార్లీ నీరు అధిక బరువును కూడా నివారిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని జీర్ణ క్రియను వేగవంతం చేస్తాయి. అందువల్ల శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం  చాలా తక్కువగా ఉంటుంది.

◆ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలను అదుపులో ఉంచుతాయి. 

◆మలబద్ధకంతో బాధపడేవారికి బార్లీ నీరు మంచి ఔషధం గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

◆కిడ్నీ లో ఉండే రాళ్లను తగ్గించే శక్తి కూడా బార్లీ గింజల నీటికీ ఉంది. 

◆మధుమేహంతో బాధపడేవారికి బార్లీ వాటర్ తాగితే షుగర్ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే బీటా గ్లూకోన్ శరీరంలో గ్లూకోజ్ గ్రహించడం ఆలస్యం చేస్తుంది. అందువల్ల శరీరంలో రక్తంలో చక్కెర నిల్వలు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

◆అంతేకాకుండా బార్లీ వాటర్ తాగడం వల్ల కీళ్ల నొప్పులు కూడా అదుపులో ఉంటాయి. ఇంకా శరీరాన్ని అధిక వేడి నుంచి కూడా కాపాడుతుంది.

ఇవే కాకుండా బాలింతలు కూడా బార్లీ వాటర్  తీసుకుంటే వారిలో పాలు ఉత్పత్తి పెరుగుతుంది.

చివరిగా ….

  బార్లీ గింజల నీరు తాగడం వల్ల పైన చెప్పుకున్న ప్రయోజనాలే కాకుండా వేసవికాలంలో కూడా చల్ల చల్లగా ఆరోగ్యం సంరక్షించుకుంటూ హాయిగ గడిపేయచ్చు. 

Leave a Comment

error: Content is protected !!