amazing-health-benefits-of-amudam-castor-oil

ఒక్క నూనెతో ఎన్నో అద్భుతాలు

ఇది ఈనాటి నూనె కాదు, దీని చరిత్ర ఎంతో…. భారతదేశపు అందమంత గొప్పది ఆముదం.

ఆముదమా అని మొహాన్ని చిన్నబుచ్చుకోనక్కర్లేదు.ఆముదం గూర్చి మొత్తం తెలిస్తే మీ మొహం విప్పారడం ఖాయం.

ఆముదంలో ఏముంది??

ఆముదం నూనెలో విటమిన్‌ ఈ, ప్రోటీన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఆముదంలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీయాసిడ్లు అధిక మోతాదులో లభిస్తాయి. అంతేకాకుండా, చర్మానికి అవసరమయ్యే పోషకాలు మరియు అత్యవసర విటమిన్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి, అందానికి చాలా ఉపయోగపడతాయి.

ఆముదం ఉపయోగాలు ఏంటి??

భారత దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఆముదాన్ని వినియోగిస్తున్నారు. వాతరోగాలను పోగొట్టడంలో దీనిది అగ్రస్థానం. గుండె జబ్బులు, విషజ్వరం, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సులువుగా నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపడంలో దీని పాత్ర అమోఘం. ఇది అందానికీ చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. జుట్టు పెరిగి, పట్టుకుచ్చులా మారేందుకు ఆముదం వాడుతుంటాం. ఇది కేవలం తలకే కాదు, చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది.

మీకోసం కొన్ని చిట్కాలు.

చర్మ సౌందర్యానికి శిరోజాల సంరక్షణకి ఆముదం చేసే మేలెంతో వర్ణించలేం, 

కాలిన లేదా కమిలిన చర్మంమీద ఆముదంలో ముంచిన దూదిని పెట్టి ఓ గంట సేపటి తరవాత కడిగేస్తే త్వరగా తగ్గుతుంది. 

కొంచెం ఆముదాన్ని ఒంటికి పట్టించి మర్దన చేస్తే చర్మంలో సాగే గుణం పెరిగి మృదువుగా తయారవుతుంది. ముఖ్యంగా కళ్ల కింద రాస్తే అక్కడి ముడతలు తగ్గి చర్మం మెరుస్తూ వయసుని కనబడనీయకుండా చేస్తుంది . 

రెండు చుక్కల ఆముదాన్ని కాసిని గోరువెచ్చని నీటిలో కలిపి ముఖానికి పట్టించి మృదువుగా మర్దన చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి . 

ఆముదంలోని రిసినోలియాక్ ఆమ్లం మొటిమలకి కారణమైన బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది . ముఖమ్మీద మచ్చలుంటే రోజూ కాస్త ఆముదంతో అక్కడ రాయడం వల్ల అవి క్రమంగా తగ్గుతాయి . 

ఆముదం కలబంద గుజ్జు సమాన భాగాలుగా తీసుకుని రెండింటికి బాగా కలిపి ముఖానికి మృదువుగా మర్దనా చేయాలి ఇరవై నిమిషాల తరువాత శుభ్రపరచుకోవాలి. కలబంధలో ఉండే గిబ్బరెల్లిన్స్ వల్ల ముఖం పై ఉన్న కాండరాలలో రక్తప్రసరణ మెరుగుపరచి  ముఖాన్ని తేమగా ఉంచడంలో కూడా ఆముదం సహాయపడుతుంది.

అలాగే గర్భం దాల్చినపుడు వచ్చిన చారలు తగ్గేందుకు ఇది పనిచేస్తుంది .  

రాత్రిపూట తలకి ఆముదాన్ని పట్టించి బాగా మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల జుట్టు పెరగడంతో బాటు తలలోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి . తెల్లబడటమూ తగ్గుతుంది . పైగా ఇది జుట్టుకి కండిషనర్ లాసూ పనిచేస్తుంది.

ఆముదాన్ని ఒక పూతగా వెన్నుపై మృదువుగా మర్దన చేసి దానిపై ఒక వస్త్రాన్ని కప్పి ఉంచాలి. దానిపై వేడి నీటి బాగ్ ను ఉంచాలి. దీనివల్ల ఎంతో బాధించే వెన్ను నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

చివరగా……

ఆముదం గూర్చి పూర్తిగా తెలుసుకుని  ఎటువంటి అలర్జీలు దుష్ప్రభావాల భయం లేదని రూఢి చేసుకుని వాడటం మొదలుపెట్టండి, అయితే ఒక్క విషయం. దేనికైనా సరే ఒక నిర్ణీత సమయం పాటిస్తూ తరచుగా వాడటం లేదా ప్రతీ రోజూ వాడటం వలన మీ సమస్యలను అధిగమించవచ్చు. ఏ మార్పైనా రాత్రికి రాత్రే జరుగదు. అందువల్ల ఒకసారి వాడి వదిలేయడం కాక కొన్నాళ్ల పాటు వాడితే క్రమంగా మార్పును మీరే గమనించవచ్చు.

1 thought on “ఒక్క నూనెతో ఎన్నో అద్భుతాలు”

Leave a Comment

error: Content is protected !!