పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అనేది నానుడి. మనం చెప్పుకోబోతున్న అశ్వగంధ ను తెలుగులో పెన్నేరుగడ్డ అంటారు.అనేక వ్యాధులలో అశ్వగంధ ను విరివిగా వాడతారు. ఇందులో ఉన్న ఔషధ విలువలు అద్బుతమైనవి. వింటర్ చెర్రీ గా పిలుచుకునే ఈ మొక్క దాదాపు రెండు మీటర్ల వరకు పెరుగుతుంది.
అసలు అశ్వగంధ లో ఏముంది??
అశ్వగంధ లో అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్లతో పాటు కాల్షియం పాస్పరస్ కూడా ఉంటాయి. అయితే అశ్వగంధలో అనేక ఆల్కలాయిడ్ లు ఉన్నాయి అందులో ప్రధానమైనది సోమిని ఫెరిన్ఖి. అశ్వగంధ మొక్క మీద జరిగిన పరిశోధనల్లో తెల్సిన నిజం అశ్వగంధ వేర్లలో ఆంటి బాక్టీరియా లక్షణాలు ఉన్నాయని. అంటే వ్యాధికారక క్రిములతో, వైరస్ లతో సమర్థవంతంగా పోరాటం చేసి వాటిని నిర్వీర్యం చేస్తుందని.
వేటికి ఉపయోగించాలి??
అశ్వగంధను అనేక వ్యాధుల వైద్యంలో ఉపయోగిస్తారు. అజీర్తి, ఆకలి లేకపోవడం, నిస్సత్తువ లాంటి లక్షణాలతో బాధపడేవారు అశ్వగంధ చూర్ణం ను తీసుకోవడం వలన సమస్యలు పరిష్కారం అవుతాయి.
అశ్వగంధ మూల చూర్ణం అంటే అశ్వగంధ వేర్లను ఎండబెట్టి తయారుచేసిన చూర్ణంను తీసుకోవడం వల్ల కీళ్లనొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.
ఇన్సోమ్నియూ అనగా నిద్రలేమి అని అర్థం. ఈ నిద్రలేమికి పరిష్కారంగా అశ్వగంధ అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది.

ఈ అశ్వగంధను ఎలా వాడాలి?
వింటర్ చెర్రీ అయిన మన అశ్వగంధ చూర్ణం ను రాత్రి పడుకునేముందు పాలలో కలిపి తాగాలి దీనివల్ల మంచి నిద్ర మన సొంతం అవుతుంది
అలాగే చలికాలం లో వచ్చే జలుబు, దగ్గు నుండి ఉపశమనం కోసం రోజుకు మూడు గ్రాముల అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల సమద్యలు పోతాయి.
అశ్వగంధ ఆకులను చాలా చర్మ వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తామర, అల్సర్ వంటి వ్యాధులలో అశ్వగంధ ఆకులను నూరి పేస్ట్ చేసి ఆ పేస్ట్ ను వ్యాధి ఉన్న ప్రాంతంలో పూయడం వల్ల చక్కని పలితం పొందవచ్చు. అదేవిధంగా కీళ్ల సమస్యల వల్ల వాపు వచ్చిన ప్రాంతంలో కూడా అశ్వగంధ ఆకులను నూరి పట్టులాగా వేయడం వల్ల ఉపశమనం ఉంటుంది.
ఇంకా చివరగా…..
అశ్వగంధ చూర్ణాన్ని ఔషధంగానే కాక రోజు అయిదు గ్రాముల చూర్ణాన్ని పాలతో కలిపి తాగుతూ ఉంటే నిరుత్సాహం, నిస్సత్తువ పోయి చురుకుదనం పెంపొందుతుంది. అశ్వగంధ చూర్ణం మాత్రమే కాకుండా అశ్వగంధ లేహ్యం, అశ్వగంధ టాబ్లెట్స్ ఇలా అశ్వగంధ ను వివిధ రకాలలో మనకు లభ్యమయ్యే వాటిలో ఏదో ఒకటి ప్రతీరోజు తీసుకోవడం వల్ల విశ్వమంత ఆత్మవిశ్వాసాన్ని మనం పొందవచ్చు.
మరొక్కసారి చెబుతున్నా అశ్వగంధ గొప్ప ఆంటి బయాటిక్ దాన్ని తక్కువగా చూడకండి.