ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం సరిగా ఉంటే మనం దేన్నైనా సాధించగలిగే నేర్పును కలిగి ఉంటామనేది జగమెరిగిన సత్యం. చాలామంది హైటు, హైటుకు తగ్గ వెయిట్ ఉంటూ ఎన్నో జాగ్రత్తలు పాటించినా ఏ నోప్పో, జబ్బో రాకుండా మానదు. కాలం అలా ఉంది మరి. కానీ ఒక్కసారి మన పెద్దల జీవితాన్ని గమనిస్తే ముఖ్యంగా మన తాతల గూర్చి వాళ్లదగ్గర కూర్చుని వాళ్ళను కదిలిస్తే వాళ్ళ అలవాట్లు అన్ని మెల్లిగా కథలు కథలుగా చెబుతారు. వాళ్ళ అలవాట్లలో ముఖ్యమైనది వాళ్ళ జీవితంలో భాగమైపోయినది ఆవు అని చెప్పవచ్చు. వ్యవసాయం నుండి వచ్చే చిన్న చిన్న జబ్బుల వరకు ప్రతిదానికి వాళ్ళు గోమాతను నమ్ముకునే జీవించారు. పంటకు, ఒంటికి పంచామృతమంత జవసత్వాన్ని చేకూర్చే గోమూత్రం గూర్చి అందులో ఉన్న విశిష్ట ఆరోగ్యప్రయోజనాలు గూర్చి తెల్సుకుందాం రండి.
◆గోమూత్రంలో కాపర్, పొటాషియం, మాంగనీస్, యూరియా, కాల్షియం, ఐరన్, యూరిక్ యాసిడ్, పాస్పెట్, సోడియం, కార్బనిక్ యాసిడ్, విటమిన్ ఎ, బి, సి, డి. మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
◆ఆయుర్వేదంలో గోమూత్రం ను అమృత సమానమైనదిగా భావిస్తారు. ఆరోగ్యకరమైన పంట నుండి ఆరోగ్యకరమైన శారీరక దృఢత్వం వరకు అన్నిటికి గోమూత్రం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది..
◆గోమూత్రాన్ని ఎరువుగా సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగిస్తారు. ఎలాంటి రసాయనాలు లేని పంట దిగుబడిని అందించడంలో గొప్పగా తోడ్పడుతుంది.
◆గోమూత్రంలో యూరిక్ ఆమ్లం యొక్క యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
◆గోమూత్రం సేవించడం వల్ల క్యాన్సర్ కణుతుల తీవ్రత తగ్గుముఖం పట్టి క్యాన్సర్ ను పూర్తిగా నిర్మూలిస్తుంది
◆సాధారణంగా గాయాలు తగిలినపుడు గాయాన్ని క్లీన్ చేయడానికి ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్ బదులుగా గోమూత్రాన్ని వాడటం వల్ల మొదలులోనే గాయం యొక్క ప్రభావాన్ని తగ్గించి బాక్టీరియా ను నిర్వీర్యం చేసి గాయం తొందరగా బాగయ్యేలా చేస్తుంది. గోమూత్రంలోని అల్లాంటిస్ యాంటీ బాడీ స్థాయిలను పెంచుతుంది.
◆గోమూత్రాన్ని సేవించడం వల్ల మన శరీరంలోని కణత్వచాన్ని పటిష్టం చేసి ఔషధ ప్రభావాన్ని ఎక్కువసేపు నిలిచి ఉండేలా చేస్తుంది దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు కూడా తొందరగా బాగవ్వడంలో తనవంతు పాత్రను పోషిస్తుంది.
◆గోమూత్రాన్ని తరచుగా తీసుకోవడం వల్ల మన శరీరంలో తెల్లరక్తకణాల స్థాయి పెరిగి రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది.
◆మధుమేహం ఉన్నవారు గోమూత్రాన్ని సేవించడం వల్ల అద్భుతాలు జరుగుతాయని ఆయుర్వేద పెద్దలు చెబుతున్నారు. ప్రతిరోజు కొద్దిగా గోమూత్రాన్ని కప్పు నీళ్లలో కలిపి తీసుకోవడం ద్వారా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
◆మన శరీరంలో కొన్ని సూక్ష్మ పోషకాలు మూత్రం ద్వారా కోల్పోతుంటాము. వాటిని కూడా గోమూత్రం సేవించడం వల్ల సులువుగా భర్తీ చేయవచ్చు.
◆గోమూత్రాన్ని సేవించడం వల్ల జీర్ణాశయంలో పేగులు శుభ్రపడటం మాత్రమే కాకుండా అల్సర్ పుండ్లు వంటి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి.
◆గోమూత్రాన్ని మాత్రం రాగి పాత్రలలో ఎపుడూ నిల్వచేయకూడదు. పింగాణీ, గాజు, స్టీల్ పాత్రలలో నిల్వచేసుకోవచ్చు. ముఖ్యంగా మట్టి పాత్రలో నిల్వచేసుకోవడం ఎంతో ఉత్తమం.
చివరగా……
మన దేశ సంపద గోవు అంటారు. అలాంటి గోసంపద రాను రాను తగ్గిపోతూ ఒకవైపు. భారతీయ వైద్యపు మూలాలులో ముఖ్యమైనవి అయిన పసుపు, గోమూత్రం లాంటి వాటి మీద విదేశాలు పేటెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే మన దేశ మేధావులు పిచ్చోళ్ళలా చూస్తూ ఉంటారు. కనీసం పౌరులమైన మనమైనా చేతనైనట్టు గోవులను కాపాడుతూ గోవు విశిష్టతను, గోమూత్ర ప్రయోజనాలను అందరికి తెలుపుతూ మనం పాటించి గొప్ప ఆరోగ్యాన్ని పొందుదాం