మధురమైన రుచితో అందరిని మైమరపించే సీతాఫలం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ఒకప్పుడు బుట్టలు బుట్టలు తిన్నవాళ్ళం ఇపుడు ఒకో పండు కొనుక్కుని తింటున్నాం. అడవులు అంతరించడం వల్ల సీతాఫలం కూడా అరుదుగా అతి ప్రియం గా అధిక ధర గా మారిపోయింది. అలంటి సీతాఫలం రుచినే కాదు ఔషధ విలువల నింపుకున్న అద్భుత ఫలము కూడా అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సీతాఫలం లో విటమిన్-సి, కేరోటిన్, థైమిన్, రిబోఫ్లెవిన్, నియసిన్ మొదలైన విటమిన్లు ఉంటాయి. ఇంకా సీతాఫలం లో పీచుపదార్థం కూడా ఉంటుంది.
చలికాలంలో దాదాపు మూడు నెలలు లభ్యమయ్యే ఈ పండు లో ఉన్న గుజ్జు కంటే విత్తనాలే అధిక బరువని చెప్పచ్చు. అయితే విత్తనమే కదా అని తీసి పారేయకండి. పండులోని గుజ్జుతో పాటు విత్తనాలు కూడా గొప్ప ఔషధంగా పనిచేస్తాయి.ఇంతకు ఈ పండు, విత్తనాలు, చెట్టు, ఆకులు వీటి లో దాగిన ఆరోగ్య రహస్యం ఒక్కసారి తెలుసుకుందాం.

సీతాఫలం శరీర వేడిని తగ్గించి చలువ చేస్తుంది. శరీరానికి మాంసకృత్తులు అందజేస్తుంది.
రాచపుండ్లకు
సీతాఫలం ఆకుల రసాన్ని పండ్ల మీద వేసి ఆకులను దంచి ఆ ముద్దను పుండు మీద పెట్టి ఆకులను కప్పి కట్టు కట్టాలి. దీనివల్ల పీహ్ణడ్లు తొందరగా మానిపోతాయి.
చర్మ వ్యాధులకు
సీతాఫలం ఆకు, వేప ఆకు, తులసి ఆకు. ఈ మూడింటిని గోరు వెచ్చని నీళ్లతో కడిగి తరువాత మేక పాలతో కలిపి మెత్తని పేస్ట్ లా చేయాలి. చర్మ సమస్య వచ్చిన చోట ఆ పేస్ట్ ను లేపనంలా వెయ్యాలి. ఎంత దారుణమైన మొండి చర్మవ్యాధులు కూడా ఈ పద్దతి వల్ల నయమవుతాయి. ఇందులో ముద్ద కర్పూరం కూడా కాసింత జతచేయవచ్చు ఇంకా తొందరగా ఫలితం కనబడుతుంది.
తలలో పేలకు
స్కూల్ కు వెళ్లే పిల్లల్లో సమస్య తలలో పేలు. ఎంత జాగ్రత్త తీసుకున్న పక్కన పక్కన కూర్చోవడం వల్ల మనకు లేని పేలు వచ్చి వాలిపోతాయ్. అయితే కొన్ని రకాల షాంపూలు వాడుతూ వాటిని వధించుకోవాల్ని అనుకుంటారు. వాటిలో రసాయనాలు చిన్న పిల్లల కుదుళ్ళ ద్వారా మెదడును చేరి బలహీనం చేస్తాయి. అందుకే సీతాఫలం విత్తనాలలో పలుకులను మెత్తగా నీటిలో రుబ్బి తలకు పట్టిస్తూ ఉంటే తలలో పేలు హరించిపోయి జుట్టును కూడా ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.
బట్టలకు రక్షణగా
సీతాఫలం గజల్ పొడిని చిన్న పొట్లాలుగా కట్టి బట్టలు పెట్టె అల్మారాల్లో పెడితే బట్టలు కొరికే పురుగుల నుండి రక్షణ ఇస్తాయి.
పేనుకొరుకుడుకు
సీతాఫలం ఆకు, ఉమ్మెత్త ఆకు రెండూ కలిపి ముద్దగా నూరి పేను కోరిన చోట వేసి మర్దనా చేయాలి 8 రోజుల పాటు ఇలా చేయడం వల్ల ముందులా జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది.
చివరగా….
ఇన్ని ఉపయోగాలున్న సీతాఫలం విత్తనాలను నిర్లక్ష్యం చేయకండి. తిన్నాక శుభ్రపరిచి జాగ్రత్త చేసుకుని అవసరం మేరకు వాడుకోండి.