Amazing Health Benefits of Custard Apple

చలికాలానికి నేస్తం సీతాఫలం….

భారత దేశంలో సీజనల్ గా కాచే పండ్లు ఎక్కువ. చలికాలంలో సీతాఫలం ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తీసుకోవడం అందరికీ మంచిది..

పిల్లల నుండి పెద్దల వరకు అందరు మెచ్చే పండు సీతాఫలం:  ఒకవైపు చలి వణుకు పుట్టిస్తుంటే మరో వైపు ఈ పండ్లు మన నోరూరిస్తుంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఈ పండ్ల రుచికి దాసోహం అనాల్సిందే. ఈ పండు రుచికే ప్రసిద్ధి కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

ఎన్నో గుణాలు ఉన్న సీతాఫలం: పొటాషియం,మ్యాంగనీస్, విటమిన్ సి, వంటి కనిజాలు ఉన్న ఈ పండు ఆరోగ్యకరమైన గుండె కోసం, మంచి రక్తప్రసరణ వ్యవస్థ కోసం తినాలి. గుండె సంబంధిత సమస్యలున్నవారు కూడా ఈ సీతాఫలం తినొచ్చు అని నిపుణులు చెబుతున్నారు., ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్(54) గా ఉంటుంది. అయితే, మధుమేహంతో బాధపడే వారిలో (జిఐ)55, అంతకంటే తక్కువ ఉన్నా ఈ పండుని హాయిగా తీసుకోవచు అని వైద్యులు సూచిస్తున్నారు.

మహిళల పాటి వరం సీతాఫలం:  మహిళలకి సీతాఫలం దేవుడిచ్చిన వరం అని చెప్పాలి. పీసీఓడి ఉన్న మహిళలకి ఐరన్ చాల అవసరం.సీతఫలంలో ఐరన్ శాతం అధికంగా ఉన్నందున, సీజన్ రాగానే ఈ పండుని ప్రతి మహిళా సంతోషంగా ఆస్వాదించవచ్చు. అదేవిధంగా సంతానం లేనివారు ఇది తీసుకుంటే..సత్పలితాలు పొందుతారు. అలసట,చిరాకు, డిప్రెషన్ చాల వరకు తగ్గుతాయని వైద్యనిపుణులు పేర్కొన్నారు.

విటమిన్’ లకి కేంద్రం సీతాఫలం:  సాధారణంగా ఏ పండైన శరీరానికి క్యాలరీలతో పాటుగా మాంసకృత్తులను అందిస్తాయి. విటమిన్ సి, ఏ, పొటాషియం,మెగ్నీషియం, నిండి ఉన్న ఈ పండు తినడం కారణంగా మన శరీరానికి అనేక లాభాలు కలుగుతున్నాయని చెప్పచ్చు. ఈ సీతాఫలాన్నిఆకలితో ఉన్నప్పుడు తింటే  కడుపు నిండిన భావన కలుగుతుంది. మెదడుకి కూడా చాల మంచిదని వైద్యులు చెబుతున్నారు. హిమోగ్లోబిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్న ఈ పండు తినడం వల్ల చర్మానికి, జుట్టుకి ఎంతో మేలు జరుగుతుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరిచే సీతాఫలం :  ఈ పండులోని గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. విటమిన్ బి, బి కాంప్లెక్స్ కి మూలం కావున జీర్ణక్రియ వేగవంతం అయ్యి.. ఎలాంటి జీర్ణ సమస్యలు దరిచేరవు. చక్కెర వ్యాధి ఉన్నవారికి కూడా ఎంతో మేలు చేసే గుణాలు సీతఫలంలో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కడుపులో అమ్లతను తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని నయం చేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!