Amazing Health Benefits of Eating Mushrooms

పుట్టగొడుగులు గూర్చి నిజం తెలిస్తే ఇపుడే తినేస్తారు

ఇపుడంటే రెస్టారెంట్లలోనూ, సూపర్ మార్కెట్లలోనూ కాస్త ఖరీదైన వంటకాల జాబితాలో చేర్చదగ్గ పుట్టగొడుగులు  అమ్ముతున్నారు.. ఒకప్పుడైతే మన బామ్మల కాలంలో వర్షాలు పడగానే కొండల మీద పుట్టలమీద పెరిగే ఫంగస్  జాతికి చెందిన పుట్టగొడుగులను తెచ్చి వంటల్లో ఉపయోగించేవారు.  వర్షాకాలం మొదలవగానే పెరిగే ఈ పుట్టగొడుగులలో తినదగినవి, తినకూడనివి అంటూ రకాలుగా ఉన్నా వీటిలో ఉన్న పోషక విలువలు గ్రహించి ఇపుడు ఏకంగా పుట్టగొడుగుల సాగు చేస్తూ తినదగిన పుట్టగొడుగులను సమస్య లేకుండా కొనుగోలు చేసి పుష్టిగా తినేస్తున్నారు.  అసలింతకు కొండల్లో పుట్టల్లో పెరిగే ఈ పుట్టగొడుగులలో అంత అద్భుతమైన పోషకాలు ఎమున్నాయ్, ఏకంగా సాగు చేసేంత సీన్ వీటికి ఎందుకుంది?? ఒక్కసారి కింద మాటర్లో లుక్కేయండి. మీరు అవాక్కవడం ఖాయం. 

అటు మాంసాహారం కాకుండా, ఇటు శాఖాహారం కాకుండా మధ్యస్థంగా ఏదైనా ఉందా అంటే  అవి రెండే.ఒకటి గుడ్డు, రెండవది పుట్టగొడుగు.  గుడ్డు గూర్చి ఇపుడు అప్రస్తుతం కానీ, పుట్టగొడుగు మాత్రం మాంసాహరమంతటి శక్తిని ఇస్తుందని నిపుణుల అభిప్రాయం. మష్రూమ్ అని ఫ్యాషన్ గా పిలుచుకునే వాటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్-సి సమృద్ధిగా ఉంటాయి. 

మరి ఈ పుట్టగొడుగులు తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటో చూద్దాం మరి.

◆90% నీటిని కలిగి ఉండే ఈ పుట్టగొడుగులలో ఇర్గోథియోనైన్, సెలీనియం అనే రెండు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను  ఎదుర్కొని గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా చేస్తాయి. 

◆సాధారణంగా మనకు విటమిన్ డి అనేది సహజంగా ఆహారంలో  లభించదు. అయితే పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల అల్ట్రా వైలెట్- బి కిరణాలను ఎక్స్పోజ్ చేయడం వల్ల విటమిన్ డి ఉత్పత్తికి సహకరిస్తాయి. కాబట్టి ఎండ, సూర్యకిరణాలు అందుబాటులో లేనివారు కొద్దిరోజులపాటు ప్రత్యామ్నాయంగా పుట్టగొడుగులు ఉపయోగించవచ్చు. 

◆పుట్టగొడుగులలో కాపర్ అధికంగా ఉంటుంది.  ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఫలితంగా మెదడు, కండరాలకు ఆక్సిజన్ సరఫరా పెరిగి వాటి పనితీరు మెరుగుపడుతుంది. గుండె, ఊరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

◆పుట్టగొడుగుల్లో 90% నీరు, మిగిలిన శాతం ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మధుమేహం ఉన్నవారు నిరభ్యరంతంగా వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అంతే కాదు  బరువు తగ్గాలని అనుకునేవారికి పుట్టగొడుగులు మంచి ప్రత్యామ్నాయం కూడా. వారంలో కనీసం మూడు లేదా నాలుగు సార్లు వీటిని తీసుకుంటూ ఉంటే అధిక బరువు సులువుగా జయించవచ్చు.

◆వీటిలో ఉన్న విటమిన్ సి ఎర్ర రక్తకణాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. అందువల్ల హిమోగ్లోబిన్ లోపం ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.

◆పుట్టగొడుగుల్లో ఉన్న పొటాషియం గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది పక్షవాతాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది

◆ఇందులో ఉన్న విటమిన్-ఈ మరియు సెలీనియం లు ప్రోస్టేట్ క్యాన్సర్ ను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 

◆రైబోప్లావిన్, నియాసిన్ లు శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలకు హాని కలిగించే కణాలను నియంత్రించడం మరియు, నిర్వీర్యం చేయడంలో తోడ్పడతాయి.

చివరగా….

పుట్టగొడుగుల్లో పైన చెప్పుకున్నట్టు నీరు అధిక మొత్తం లోనూ, కొవ్వు పదార్థాలు, క్యాలరీలు తక్కువ మోతాదులోనూ ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మరిప్పడు నమ్ముతారా….  ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా నింపుకున్న ఆరోగ్య పుట్టలని.

Leave a Comment

error: Content is protected !!